కొత్త సవాళ్లను ఎదుర్కోవడానికి భయపడను.. ఎప్పుడూ ఆకలితో ఉంటానంటూ మౌనీరాయ్ షాకింగ్ స్టేట్‌మెంట్

by Mallepaka Hamsa |   (  Updated:2026-05-26 14:28:20  IST  )

నాకు నటన అంటే పిచ్చి. మంచి పాత్రలు చేయడం కోసం నేను ఎప్పుడూ ఆకలితో ఉంటాను.

కొత్త సవాళ్లను ఎదుర్కోవడానికి భయపడను.. ఎప్పుడూ ఆకలితో ఉంటానంటూ మౌనీరాయ్ షాకింగ్ స్టేట్‌మెంట్
X

దిశ, సినిమా: బాలీవుడ్ హాట్ బ్యూటీ మౌనీ రాయ్ గత కొద్ది కాలంగా నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఇటీవల తన భర్త సూరజ్ నంబియార్ నుండి విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించి అందరికీ పెద్ద షాక్ ఇచ్చింది. ఈ విడాకుల విషయాన్ని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా స్వయంగా నెటిజన్లతో పంచుకుంది. తామిద్దరం ఇష్టపూర్వకంగానే, ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా విడిపోవాలని నిర్ణయించుకున్నామని మౌని తెలిపింది. జీవితంలో ఎదురైన ఈ క్లిష్ట సమయంలో తమ వ్యక్తిగత జీవితాన్ని గౌరవించాలని, ప్రైవసీ ఇవ్వాలని ఆమె కోరింది. అలాగే సోషల్ మీడియాలో తమ బంధంపై వస్తున్న రకరకాల అబద్ధపు ప్రచారాలను, రూమర్లను నమ్మవద్దని స్పష్టం చేసింది. పర్సనల్ లైఫ్‌లో ఇంత పెద్ద బాధాకరమైన సంఘటన జరిగినప్పటికీ, మౌని రాయ్ ఎక్కడా తన ధైర్యాన్ని కోల్పోలేదు. తన ప్రొఫెషనల్ లైఫ్‌పై పూర్తి ఫోకస్ పెట్టింది. ప్రతిష్టాత్మక 'కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2026' లో ఆమె మెరిసింది. ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మౌని తన నటన, కెరీర్ గురించి ఎమోషనల్‌గా మాట్లాడింది.

"నాకు నటన అంటే పిచ్చి. మంచి పాత్రలు చేయడం కోసం నేను ఎప్పుడూ ఆకలితో ఉంటాను. కేవలం గ్లామర్ పాత్రలే కాకుండా.. కామెడీ, ట్రాజెడీ, విలన్ షేడ్స్ ఉన్న డార్క్ క్యారెక్టర్స్.. ఇలా ఎలాంటి రోల్స్ ఇచ్చినా చేయడానికి నేను రెడీ. కొత్త సవాళ్లను ఎదుర్కోవడానికి ఎప్పుడూ భయపడను" అని మౌని రాయ్ చెప్పుకొచ్చింది. బుల్లితెర టీవీ సీరియల్స్ నుండి వెండితెరపై నటిగా మారిన తన ప్రయాణం ఒక రోలర్ కోస్టర్ లాంటిదని ఇందులో ఎన్నో కష్టాలు, ప్లాపులు, హిట్లు ఉన్నాయని గుర్తుచేసుకున్నారు. అయితే నటనపై తనకున్న ప్రేమ మాత్రం ఎప్పుడూ తగ్గలేదని, ప్రతిరోజూ పొద్దున్నే లేచి షూటింగ్‌కు వెళ్లడమే తనకు దేవుడిచ్చిన గొప్ప బహుమతి అని ఎమోషనల్ అయ్యారు. ఇక ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఈవిషయం తెలుసుకున్న నెటిజన్లు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Next Story