- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సినిమాలకంటే నేను ఆ విషయంలోనే బాగా ఫేమస్ అయ్యాను.. బోల్డ్ బ్యూటీ హాట్ కామెంట్స్
ఒకే ఒక్క సినిమాతో స్టార్ క్రేజ్ తెచ్చుకున్న నటి హనీరోజ్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ బ్యూటీ మ్యాన్ ఆఫ్ గాడ్ నందమూరి బాలకృష్ణ సరసన 'వీర నరసింహ రెడ్డి' సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.

దిశ, వెబ్‌డెస్క్: ఒకే ఒక్క సినిమాతో స్టార్ క్రేజ్ తెచ్చుకున్న నటి హనీరోజ్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ బ్యూటీ మ్యాన్ ఆఫ్ గాడ్ నందమూరి బాలకృష్ణ సరసన 'వీర నరసింహ రెడ్డి' సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. అలా ఒక్క సినిమాతోనే ఈ ముద్దుగుమ్మ కుర్రాళ్ళ హాట్ ఫేవరెట్ అయిపోయింది. ఇక ఈ చిత్రంలో రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి ఆకట్టుకుంది. బాలకృష్ణ తల్లిగా, భార్యగా నటించి మెప్పించింది.
అలాగే ఈ అమ్మడు అందంతోనే కాదు తన నటన పరంగా కూడా ఫుల్ మార్కులు తెచ్చుకుంది. అయితే ఈ సినిమా తర్వాత హనీ రోజ్ మరో మూవీ చేయలేదు. కానీ నిత్యం సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. అయితే హనీ రోజ్ మరో సినిమా చేయాలని ఎంతో ఆత్రుతగా చూస్తున్న క్రమంలో.. చాలా రోజుల తర్వాత ఓ సినిమాను అనౌన్స్ చేసింది ఈ హాట్ బ్యూటీ. 'రాచెల్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ ముద్దుగుమ్మ.
అయితే ఈ సినిమాలో ఈ బ్యూటీదే మెయిన్ రోల్ కావడం విశేషం. ఈ నేపథ్యంలో హాని రోజ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హనీ రోజ్ ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంది. ఆమె మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం నేను ఇండస్ట్రీకి వచ్చి 20 సంవత్సరాలు అయింది. అయితే ఇప్పటి వరకు నా హృదయానికి దగ్గరగా ఉండే పాత్ర ఇంకా రాలేదు.
నా ఫస్ట్ మూవీ పెద్దగా విజయం సాధించకపోవడంతో మలయాళ ఇండస్ట్రీలో చాలా సమస్యలను ఎదుర్కొన్నాను. అయితే నేను నటించిన చిత్రాల కంటే షాపింగ్ మాల్స్ ఓపినింగ్స్‌లో పాల్గొనడం ద్వారానే ఎక్కువ పాపులారిటీ సంపాదించుకున్నాను’ అని చెప్పుకొచ్చింది హనీ రోజ్. ప్రస్తుతం ఈ బ్యూటీ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.






