నీ రాక కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నాను.. మెగా డాటర్ ఇంట్రెస్టింగ్ పోస్ట్

by Gugulothu.Kavitha |

మెగా డాటర్ నిహారిక కొణిదెల(NIHARIKA KONIDELA) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

నీ రాక కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నాను.. మెగా డాటర్ ఇంట్రెస్టింగ్ పోస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: మెగా డాటర్ నిహారిక కొణిదెల(NIHARIKA KONIDELA) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొన్ని సినిమాల్లో హీరోయిన్‌గా నటించి మెప్పించింది. కానీ అనుకున్నంతగా విజయం సాధించలేదు. దీంతో నిర్మాతగా మారి సినిమాలు తీస్తున్నది. అలా ఫస్ట్‌గా తీసిన మూవీ ‘కమిటి కుర్రోళ్లు’(Comittee Kurrollu). తన ఫస్ట్ చిత్రంతోనే బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. దీంతో ప్రొడ్యూసర్‌గా సక్సెస్ అయింది. ప్రస్తుతం రెండు మూడు సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తుంది.

ఇక ఈ భామ వ్యక్తిగత విషయానికి వస్తే.. నిహారిక చైతన్య జొన్నలగడ్డ(Chaitanya Jonnalagadda) అనే వ్యక్తిని మ్యారేజ్ చేసుకుంది. కానీ పెళ్లైన ఏడాదికే విడాకులు తీసుకుంది. ప్రస్తుతం తమ తల్లిదండ్రుల వద్దే ఉంటుంది. అలాగే నిత్యం ఫ్రెండ్స్‌తో వేకెషన్స్‌కు వెళుతూ ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. వాటిని సోషల్ మీడియా(Social Media) వేదికగా పంచుకుంటూ అభిమానులకు ట్రీట్ ఇస్తుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.

తాజాగా నిహారిక తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్ట్ స్టోరీ పెట్టింది. అందులో.. ‘నీ రాక కోసం ఈ అత్త ఎదురు చూస్తూ ఉంది. త్వరగా వచ్చేయ్ లిటిల్ వన్’ అని రాసుకొస్తూ ఓ ఫొటో షేర్ చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. కాగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠిలు తల్లిదండ్రులు కాబోతున్న సంగతి విదితమే. ఈ విషయాన్ని నిన్న వారు సోషల్ మీడియా వేదికగా ప్రకటించడంతో ఆ విషయం అందరికీ తెలిసింది. ఈ క్రమంలోనే మెగా డాటర్ నిహారిక కూడా తన మేన కోడలికి గ్రాండ్‌గా వెల్‌కమ్ చెబుతూ పోస్ట్ పెట్టింది.




Next Story