Bollywood Star Hero: నేను రొమాంటిక్ ఫెలోని.. అబద్దమనిపిస్తే నా ఇద్దరు మాజీ భార్యలను అడగమన్న బాలీవుడ్ స్టార్ హీరో ( వీడియో )

by Prasanna |   ( Updated:2025-01-12 13:42:49.0  )
Bollywood Star Hero: నేను రొమాంటిక్ ఫెలోని..  అబద్దమనిపిస్తే నా ఇద్దరు మాజీ భార్యలను అడగమన్న బాలీవుడ్ స్టార్ హీరో ( వీడియో )
X

దిశ, వెబ్ డెస్క్ : ఒకప్పుడు హిట్స్ మీద హిట్స్ కొట్టిన సూపర్ స్టార్ అమీర్ ఖాన్ ( Aamir Khan ) ఇప్పుడు కాస్తా తగ్గి కొడుకును లైన్ లో పెట్టడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. తన కుమారుడు జునైద్ ఖాన్ ( Junaid Khan ) హీరోగా ‘మహారాజ్’ మూవీతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఇప్పుడు, తన కొత్త మూవీ ‘లవేయాపా’ తో మన ముందుకు రాబోతున్నాడు. రీసెంట్ గా కొడుకు జునైద్ మూవీ ట్రైలర్ లాంచ్ కి కూడా అమీర్ ఖాన్ గెస్ట్ గా హాజరయ్యాడు. ఇక, ఇదే ఈవెంట్‌లో అమీర్‌ఖాన్‌ చేసిన షాకింగ్ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. అమీర్ ఖాన్ రియల్ లైఫ్ లో చాలా రొమాంటిక్ అని చెప్పాడు.

బాలీవుడ్‌లో హీరోగానే కాకుండా డైరెక్టర్, నిర్మాతగా కూడా సక్సెస్ అయి అమీర్‌ఖాన్ ( Aamir Khan ) ఎన్నో కొత్త ప్రయోగాలు చేసి తానేంటో నిరూపించుకున్నాడు. అయితే, తాజాగా తన కొడుకు కొత్త మూవీ ట్రైలర్‌ లాంచ్‌లో " నేను ఇలా చెప్పొచో ? లేదో తెలియదు .. నేను చాలా రొమాంటిక్‌ పర్సన్‌ని.. నేను చెప్పిన దానిలో అబద్దమనిపిస్తే .. తన ఇద్దరు మాజీ భార్యలను అడగవచ్చు. నేను రొమాటింక్ మూవీస్ చూసేటప్పుడు అన్నీ సీన్స్ చూస్తాను .. వేటిని కూడా వదలను . నాకు రొమాన్స్ అంటే చాలా ఇష్టం .." అంటూ తన మాటల్లో చెప్పుకొచ్చాడు.


Click Here For Tweet..

Advertisement

Next Story