నేను కూడా నా యూరిన్ తాగాను.. దాని వల్ల కలిగే ప్రయోజనాలు చాలా ఉన్నాయి.. హీరోయిన్ సంచలన కామెంట్స్(వీడియో)

by Gugulothu.Kavitha |

స్టార్ యాక్టర్ పరేష్ రావల్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించినప్పటికీ.. ఇతనికి శంకర్ దాదా ఎమ్‌బిబిఎస్ సినిమాతో మాత్రం మంచి ఫేమ్ వచ్చింది.

నేను కూడా నా యూరిన్ తాగాను.. దాని వల్ల కలిగే ప్రయోజనాలు చాలా ఉన్నాయి.. హీరోయిన్ సంచలన కామెంట్స్(వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ యాక్టర్ పరేష్ రావల్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించినప్పటికీ.. ఇతనికి శంకర్ దాదా ఎమ్‌బిబిఎస్ సినిమాతో మాత్రం మంచి ఫేమ్ వచ్చింది. చిరంజీవి లింగం మావా అంటూ అతన్ని ముప్పుతిప్పలు పెట్టిన తీరు ఇప్పటికీ తలుచుకుంటే ఫుల్ నవ్వొస్తుంటది. అయితే ఆయన రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో అతను మోకాలి గాయంతో ముంబైలోని సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో చేరినప్పుడు అజయ్‌ దేవ్‌గణ్‌ తండ్రి వీరు దేవ్‌గణ్‌ ఇచ్చిన సలహామేరకు అతను తన యూరిన్‌‌ను 15 రోజుల వరకు తాగాను అని, దాంతో తన గాయం నయం అయ్యిందని, అతని ఎక్స్ రే చూసి డాక్టర్లు కూడా షాక్ అయ్యారని షాకింగ్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో ఇప్పుడు మరో నటి కూడా యూరిన్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. మరి ఆమె ఎవరో కాదండోయ్ బాలీవుడ్ బ్యూటీ అను అగర్వాల్. ఆమె యూరిన్ తాగడం గురించి మాట్లాడుతూ.. ‘యూరిన్ తాగడం అనేది యోగాలో ఓ ముద్ర.. యూరిన్ తాగడం వల్ల మొహం పై ముడతలు తగ్గుతాయి. చాలా మందికి యూరిన్ తాగడం వల్ల కలిగే లాభాలు తెలియదు. తెలిసినా కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు.

యూరిన్ తాగ‌డాన్ని ఆమ్రోలి అంటారు నేను కూడా యూరిన్ తాగాను. యూరిన్‌లో కొంత తీసుకోవడం మంచిదే.. యూరిన్ తాగడం వల్ల నాకు ఆరోగ్య ప‌రంగా ఎంతో ప్రయోజనం చేకూర్చింది’ అని సంచలన కామెంట్స్ చేసింది చెప్పుకొచ్చింది. అలాగే యూరిన్ తాగొద్దు అని డాక్టర్స్ చెప్తారుకదా..? అనే ప్రశ్నకు సైన్స్ 200 ఏళ్ళ నాటిది.. యోగ 1000ఏళ్ల నాటిది అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Next Story