- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొత్త లుక్‌తో సర్ప్రైజ్ చేసిన యంగ్ హీరో.. రీ-ఎంట్రీకి హైప్ క్రేజ్!
బ్యాక్ బెంచ్ స్టూడెంట్, లేడీస్ అండ్ జెంటిల్ మేన్ వంటి హిట్ చిత్రాలతో తెలుగు ఆడియన్స్ లో గుర్తింపు తెచ్చుకున్న హీరో మహత్ రాఘవేంద్ర.

దిశ,వెబ్‌డెస్క్: బ్యాక్ బెంచ్ స్టూడెంట్, లేడీస్ అండ్ జెంటిల్ మేన్ వంటి హిట్ చిత్రాలతో తెలుగు ఆడియన్స్ లో గుర్తింపు తెచ్చుకున్న హీరో మహత్ రాఘవేంద్ర. ఈ యంగ్ టాలెంటెడ్ హీరో మంగాత, జిల్లా, చెన్నై 28 పార్ట్ 2 వంటి పలు సక్సెస్ ఫుల్ తమిళ చిత్రాలతో పాటు డబుల్ ఎక్స్ ఎల్ వంటి బాలీవుడ్ సినిమాల్లోనూ నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. మహత్ రాఘవేంద్ర ఇప్పుడు తిరిగి టాలీవుడ్ కు రాబోతున్నారు. కంప్లీట్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్, న్యూ లుక్ తో మహత్ రాఘవేంద్ర ఆకట్టుకుంటున్నారు.
హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ తో మహత్ రాఘవేంద్ర ఓ ఇంట్రెస్టింగ్ మూవీ చేస్తున్నారు. ఈ సినిమాతో తెలుగు ఆడియన్స్ ముందుకు తిరిగి రావడం హ్యాపీగా ఉందని మహత్ రాఘవేంద్ర తెలిపారు. తనను ఇప్పటిదాకా ఆదరించిన తెలుగు ప్రేక్షకులు మరోసారి తమ లవ్ అండ్ సపోర్ట్ అందిస్తారని ఆయన ఆశిస్తున్నారు. టాలీవుడ్ రీ ఎంట్రీ పట్ల ఎగ్జైటింగ్ గా ఉన్నానని, ఇది తన కెరీర్ కు కొత్త ఛాప్టర్ అవుతుందని మహత్ రాఘవేంద్ర చెప్పారు.






