- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
OTTలో క్రైమ్ థ్రిల్లర్... ఆ చిత్రం మాదిరిగానే క్లూస్ దొరక్కుండా భార్యను ముగించేసిన భర్త
సినిమాలు అంటే సందేశాత్మకంగా, స్ఫూర్తిదాయకంగా లేదా వినోదాన్ని అందించేలా ఉండాలి. కానీ ఇటీవల విడుదలైన ఓ చిత్రం ఏకంగా ఓ మర్డర్ ప్లాన్‌నే ఇచ్చిందంటే అతిశయోక్తి కాదు.

దిశ, వెబ్‌డెస్క్: సినిమాలు అంటే సందేశాత్మకంగా, స్ఫూర్తిదాయకంగా లేదా వినోదాన్ని అందించేలా ఉండాలి. కానీ ఇటీవల విడుదలైన ఓ చిత్రం ఏకంగా ఓ మర్డర్ ప్లాన్‌నే ఇచ్చిందంటే అతిశయోక్తి కాదు. ఆ సినిమా చూసి అచ్చం అందులో చేసినట్టే ఓ హత్య చేసి సాక్ష్యాధారాలు దొరకకుండా తప్పించుకోవాలని చూశాడో ప్రబుద్దుడు. హైదరాబాద్‌లో ఆర్మీ మాజీ జవాన్ చేసిన హత్య దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఇతడు మలయాళ మూవీని చూసి ప్రేరణ పొందే ఈ మర్డర్‌కు ప్లాన్ చేసినట్టు పోలీసుల ఎదుట అంగీకరించడం పెను సంచలనంగా మారింది.
ఇదీ సినిమా కథ
ఇటీవల ఓటీటీలో మలయాళ చిత్రం ‘సూక్ష్మదర్శిని’ విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటుంటూ రూ.50 కోట్లను రాబట్టింది. అయితే ఈ సినిమాలో ఇంట్లో వాళ్లకు ఇష్టం లేకుండా ఒక అమ్మాయిని దత్తత తీసుకుంటాడు చిత్ర విలన్. ఆ తర్వాత దత్తత కూతురిని తల్లితో కలిసి హత్య చేస్తాడు. మృతదేహాన్ని మాయం చేయడానికి శరీరాన్ని ముక్కలుగా నరికి వివిధ రసాయనాలు, యాసిడ్ వాడి ద్రవంలా చేస్తారు. దానిని బాత్ రూంలో ఫ్లష్ చేసి డ్రైనేజీలోకి వదిలేస్తారు. ఎముకలను పొడి చేసి టాయ్ లెట్ ద్వారా డ్రైనేజీలో కలిపేస్తారు. శవం వాసన బయటకు రాకుండా రసాయనాలు ఉపయోగిస్తారు. ఇది ఆ సినిమా వృత్తాంతం.
సీన్ టు సీన్ దింపేసిన గురుమూర్తి
మీర్ పేట్‌లో ఇటీవల గురుమూర్తి అనే ఆర్మీ మాజీ జవాన్ తన భార్య వెంటక మాధవిని అతి కిరాతంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఇతను కూడా భార్యను ఇంట్లోనే హత్య చేసి ఆమె శరీర భాగాలను ముక్కలుగా నరికి ఆపై బకెట్లో వేసి హీటర్‌తో బాగా ఉడికించాడు. ఆ తర్వాత బొక్కలను, మాంసాన్ని వేరు చేశాడు. మళ్లీ మాంసాన్ని కుక్కర్‌లో వేసి మెత్తగా ఉడికించి ఆరపెట్టాడు. ఆరిపోయిన మాంసాన్ని పొడిగా మార్చి బాత్ రూంలో ఫ్లష్ చేసి డ్రైనేజీలోకి వదిలాడు. బొక్కలను సైతం చిన్న చిన్న ముక్కలుగా నరికి స్టౌపై కాల్చాడు. వాటినీ పొడిగా మార్చి సమీపంలోని చెరువులో వేశాడు. మృతదేహం వాసన రాకుండా వివిధ రసాయనాలను, యాసిడ్‌ను వాడాడు. అచ్చం సూక్ష్మదర్శిని సినిమాలోని సీన్స్‌ను మక్కీకి మక్కి కాపీ చేసి హత్య చేయడంతోపాటు, శవాన్ని మాయం చేశాడు. ఆపై పలు కెమికల్స్ వాడి ఇంటికి శుభ్రం చేశాడు. ఇతంతా చేయడానికి గురుమూర్తికి 48 గంటల సమయం పట్టింది. పోలీసులకు ఎలాంటి క్లూస్ వదలకుండా పక్కాగా ప్లాన్ చేసి భార్యను ముగించేశాడు.
నేరం చేస్తే చాలు.. పట్టుబడటం ఖాయం
సినిమా అయినా రియల్ లైఫ్ అయినా సరే. తప్పు చేస్తే శిక్ష అనుభవించక తప్పదు. సూక్ష్మదర్శినిలో అతడు ఎంత పక్కాగా ప్లాన్ చేసి హత్య చేసినా పోలీసులకు చిక్కక తప్పలేదు. ఇక్కడ ఆర్మీ జవాన్ అయినా పోలీసుల వలలో పడక మానలేదు. గురుమూర్తి రెండు రోజులు కష్టపడి హత్య చేసి శవాన్ని మాయం చేసినా పోలీసులు అతడే నిందితుడని తేల్చారు. ప్రస్తుతం టెక్నాలజీ ఎంతో పెరిగింది. దానిని ఉపయోగించే క్లూస్ టీం సైంటిఫిక్‌గా హతురాలు వెంకట మాధవి రక్తం మరకలు, సగం కాలిపోయిన ఆమె వెంట్రుకలు, శరీర అవశేషాలను గుర్తించింది. వాటి ఆధారంగా డీఎన్ఏ టెస్టులు చేసి నేరాన్ని రుజువు చేసే ప్రయత్నంలో పోలీసులు తలమునకలై ఉన్నారు. గురుమూర్తి వివిధ కెమికల్స్, యాసిడ్ బాటిల్స్, కత్తులు, రంపం కొనుగోలు చేసిన దుకాణాలను గుర్తించింది. బొక్కలను కాలుస్తుండగా అతడి చేతులు సైతం కాలి గాయాలు అయ్యాయి. సీసీ కెమెరాల్లోనూ మృత అవశేషాలను తరలిస్తున్న దృశ్యాలు రికార్డు అయ్యాయి. ఇవన్నీ గురుమూర్తిని దోషిగా నిలబెట్టడానికి ఉపయోగపడతాయని పోలీసులు చెబుతున్నారు. ఏదిఏమైనా ఓ సినిమా మరో మనిషిని హత్యకు పురిగొల్పడం ఆందోళన కలిగించే విషయమే.






