Huma qureshi: నాకు డ్యాన్స్ అంటే ఇష్టం.. అందుకే స్పెషల్ సాంగ్‌లో చేస్తున్నా.. వైరల్‌గా బోల్డ్ బ్యూటీ కామెంట్స్

by Chukka Sudharani |

బాలీవుడ్ హీరో రాజ్ కుమార్ రావు (Raj Kumar Rao) త్వరలో ‘మాలిక్’ (Malik) మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

Huma qureshi: నాకు డ్యాన్స్ అంటే ఇష్టం.. అందుకే స్పెషల్ సాంగ్‌లో చేస్తున్నా.. వైరల్‌గా బోల్డ్ బ్యూటీ కామెంట్స్
X

దిశ, సినిమా: బాలీవుడ్ హీరో రాజ్ కుమార్ రావు (Raj Kumar Rao) త్వరలో ‘మాలిక్’ (Malik) మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాకు పుల్‌కిత్ దర్శకత్వం వహిస్తుండగా.. టిప్స్ ఫిల్మ్స్, లైట్ ఫిల్మ్స్ బ్యానర్స్‌పై కుమార్ తరుణి, జై శవక్రమణి, నిర్మిస్తు్న్నారు. ఇందులో రాజ్ కుమార్ రావు గ్యాంగ్‌స్టర్ పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ యాక్షన్ ప్యాక్డ్ థ్రిల్లర్ చిత్రం జూలై 11న థియేటర్స్‌లో విడుదల కాబోతుంది. ఈనేపథ్యంలో.. తాజాగా మూవీ నుంచి ‘దిల్‌థామ్ కే’ అనే సాంగ్‌ను రిలీజ్ చేశారు చిత్ర బృందం.

హుమా ఖురేషి (huma qureshi) మాస్ స్టెప్పులతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సాంగ్ ప్రజెంట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హుమా ఖురేషి ‘దిల్‌థామ్ కే’ (Dil Thaam Ke) సాంగ్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ‘డ్యాన్స్ అంటే నాకు చాలా ఇష్టం. కాబట్టి ‘దిల్‌థామ్ కే’ గురించి నాతో మాట్లాడినప్పుడు.. వెంటనే ఓకే చేశాను. ఈ సాంగ్‌లో ప్రదర్శన ఇవ్వడం నాకు చాలా సంతోషానిచ్చింది. అలాగే ఈ సినిమాతో ప్రేక్షకులు నన్ను సూపర్ మాసివ్ అవతార్‌లో చూడబోతున్నారు. షూటింగ్ చివరి రోజున నేను 16 గంటలకు పైగా వర్క్ చేశాను. నా లవ్లీ ఫ్రెండ్ రాజ్‌తో కలిసి పనిచేయడం ఒక అద్భుతమైన అనుభవం.. ఈ సినిమా కోసం నేను వేచి ఉండలేక పోతున్నా’ అంటూ చెప్పుకొచ్చింది.

Next Story