- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మంచు విష్ణుకు బంపర్ ఆఫర్.. కన్నప్పకు భారీ శాటిలైట్ డీల్!
హీరో మంచి విష్ణు తాజాగా చేసిన సినిమా కన్నప్ప. ఈ సినిమా మొన్న శుక్రవారం రిలీజ్ అయి... మంచి కలెక్షన్స్ రాపడుతోంది. ఇప్పటి

దిశ, వెబ్ డెస్క్: హీరో మంచి విష్ణు తాజాగా చేసిన సినిమా కన్నప్ప. ఈ సినిమా మొన్న శుక్రవారం రిలీజ్ అయి... మంచి కలెక్షన్స్ రాపడుతోంది. ఇప్పటికే 50 కోట్లు దాటింది కన్నప్ప సినిమా. కన్నప్ప సినిమాలో హీరోగా మంచు విష్ణు... ఆకట్టుకోగా... రెబల్ స్టార్ ప్రభాస్, మోహన్ లాల్, మంచు మోహన్ బాబు, కాజల్, అక్షయ్ కుమార్ లాంటి నటీనటులు ఇందులో ఉన్నారు.
అయితే ఈ సినిమా రిలీజ్ కంటే ముందే శాటిలైట్, ఓటీటీ ఆఫర్లు వచ్చాయి. అయితే వాటిని మాత్రం మంచు విష్ణు రిజెక్ట్ చేసినట్లు ఇప్పటికే ప్రకటించాడు. మంచి కంటెంట్ ఉంటే... మార్కెట్లో సంచలనం సృష్టిస్తామన్న ధైర్యంతో ముందుకు వెళ్లినట్లు తాజాగా విష్ణు పేర్కొన్నాడు. అయితే ఇలాంటి నేపథ్యంలో కన్నప్పకు భారీ డీల్ వచ్చిందని అంటున్నారు.
కన్నప్ప హిందీ శాటిలైట్ హక్కులు భారీ స్థాయిలో అమ్ముడుపోయాయని సమాచారం అందుతోంది. ప్రముఖ లీడింగ్ ఏజెన్సీ ఈ హక్కులను 20 కోట్లకు కొనుగోలు చేసిందని సమాచారం అందుతోంది. ఒకవేళ ఇదే నిజమైతే... విష్ణు కెరియర్ లోనే కాదు తెలుగు చిత్ర పరిశ్రమలో అతిపెద్ద డీల్ అవుతుందని చెబుతున్నారు. అదే సమయంలో తెలుగు, మలయాళం, కన్నడ అలాగే తమిళం ఓటీటీ హక్కులను కొనుగోలు చేసేందుకు ఓటీటీ సంస్థలు ముందుకు వస్తున్నాయట. భారీ ధర వస్తే.. ఆలోచిస్తామని అటు చిత్ర బృందం చెబుతోంది.






