- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జైలర్ 2 తెలుగు రైట్స్‌పై భారీ డిమాండ్.. తగ్గేదేలే అంటున్న సన్ పిక్చర్స్
జైలర్ సాధించిన విజయంతో రజినీకాంత్ జైలర్ 2 థియేట్రికల్ రైట్స్‌లో మేకర్స్ కోట్లల్లో డిమాండ్ చేస్తూ అస్సలు తగ్గడం లేదు.

దిశ, సినిమా: సూపర్ స్టార్ రజినీకాంత్, నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్‌లో సన్ పిక్చర్స్ భారీ బడ్జె్ట్‌తో తెరకెక్కించిన చిత్రం ‘జైలర్’. 2023లో వచ్చిన ఈ మూవీ ఘన విజయం సాధించడంతో ఇప్పుడు రాబోతున్న జైలర్ 2 పై భారీ హైప్ క్రియేట్ అయింది. తాజాగా ఈ సీక్వెల్ షూటింగ్ కూడా కంప్లీట్ కాగా.. అప్పుడే తెలుగు థియేట్రికల్ రైట్స్ కోసం మార్కెట్‌లో పెద్ద చర్చే మొదలైంది. జైలర్ రూ. 70 కోట్లకు పైగా గ్రాస్ వసూలు రాబట్టగా.. ఇప్పుడు ఆ క్రేజ్‌తోనే సన్ పిక్చర్స్ ఈ సీక్వెల్ తెలుగు డబ్బింగ్ రైట్స్‌ను రూ. 60 కోట్లకు పైనే కోట్ చేస్తోంది. అయితే.. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం కొందరు తెలుగు నిర్మాతలు రూ. 60 కోట్ల వరకు ఆఫర్ చేసినా సన్ పిక్చర్స్ ఒప్పుకోవడం లేదట.
గతేడాది రజనీకాంత్ కూలీ తెలుగు రైట్స్ GSTతో కలిపి రూ. 52 కోట్లకు అమ్ముడయ్యాయి. అలాగే వెట్టయాన్ కూడా మంచి ఓపెనింగ్ తెచ్చుకున్నా ఆశించిన స్థాయిలో రికవరీ జరగలేదు. కానీ అవేవీ జైలర్ 2కు అడ్డంకి కాదని నమ్ముతున్న మేకర్స్ ఈ సీక్వెల్ విషయంలో మాత్రం ఏమాత్రం తగ్గడం లేదట. దీంతో గతంలో జైలర్ తెలుగు హక్కులు తీసుకున్న ఏషియన్ ఫిలిమ్స్, దిల్ రాజు, సురేష్ ప్రొడక్షన్స్ కలిసి జైలర్ 2ను కూడా తెలుగులో రిలీజ్ చేస్తారా లేదా అన్నది సందేహంలో పడింది. సన్ పిక్చర్స్ మాత్రం రేటు విషయంలో తగ్గేది లేదు అంటోంది. చివరికి ఏ బ్యానర్ రైట్స్ తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది.






