ఒకే రోజు బాక్సాఫీస్‌ వద్ద భారీ పోటీ… ‘ఎపిక్ ’ vs ‘చెన్నై లవ్ స్టోరీ ’ మధ్య గట్టి క్లాష్

by Pulgam srinivas |

ఎపిక్, చెన్నై లవ్ స్టోరీ చిత్రాలను జూలై 10న విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఒకే రోజు బాక్సాఫీస్‌ వద్ద భారీ పోటీ… ‘ఎపిక్ ’ vs ‘చెన్నై లవ్ స్టోరీ ’ మధ్య గట్టి క్లాష్
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగు ఆడియన్స్ ఈ మధ్యకాలంలో చిన్న సినిమాలు, ముఖ్యంగా ప్రేమకథా చిత్రాలపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. దాంతో రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమాలకు బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు లభిస్తున్నాయి. తాజాగా మంచి క్రేజ్ సంపాదించుకున్న రెండు రొమాంటిక్ చిత్రాలు ఎపిక్ మరియు చెన్నై లవ్ స్టోరీ. ఎపిక్ సినిమాలో ఆనంద్ దేవరకొండ హీరోగా నటించగా, వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా కనిపించింది. ఇక చెన్నై లవ్ స్టోరీ చిత్రంలో కిరణ్ అబ్బవరం హీరోగా నటించగా శ్రీ గౌరీ ప్రియా హీరోయిన్‌గా నటించింది.

మొదట ఎపిక్ చిత్రాన్ని మే 15న విడుదల చేయాలని ప్రకటించగా, చెన్నై లవ్ స్టోరీను మే 22న రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ రెండు సినిమాల విడుదల వాయిదా పడే అవకాశం ఉందని తెలుస్తోంది. కొత్త షెడ్యూల్ ప్రకారం రెండు చిత్రాలను జూలై 10న విడుదల చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. దీంతో ఈ రెండు రొమాంటిక్ ఎంటర్టైనర్లు ఒకే సమయంలో విడుదలై బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ ఎదుర్కోనున్నాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Next Story