అల్లరి నరేష్ 'రంభ ఊర్వశి మేనక' కోసం భారీ బడ్జెట్.. కారణం అదే?

by Pulgam srinivas |

అల్లరి నరేష్ 'రంభ ఊర్వశి మేనక' చిత్రంలో దాదాపు 30 నిమిషాల సీజీ ఫుటేజ్ ఉండనున్నట్లు, దీంతో బడ్జెట్ భారీగా పెరగనున్నట్లు తెలుస్తోంది.

అల్లరి నరేష్ రంభ ఊర్వశి మేనక కోసం భారీ బడ్జెట్.. కారణం అదే?
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ హీరో అల్లరి నరేష్ ప్రస్తుతం 'రంభ ఊర్వశి మేనక' చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. 'రాధా' ఫేమ్ చంద్రమోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హాస్య మూవీస్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు కనిపించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ పాత్రల కోసం ఎవరిని ఎంపిక చేశారనే విషయాన్ని చిత్ర బృందం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఇక ఈ సినిమా కోసం నిర్మాతలు భారీ బడ్జెట్‌ను వెచ్చిస్తున్నట్లు సమాచారం.

అందుకు ప్రధాన కారణం చిత్రంలో దాదాపు 30 నిమిషాల పాటు సీజీ (CG) ఫుటేజ్ ఉండనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విజువల్ ఎఫెక్ట్స్ సన్నివేశాల కోసం పెద్ద మొత్తాన్ని ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో సినిమా బడ్జెట్ కూడా గణనీయంగా పెరిగినట్లు సమాచారం. అనేక అపజయాల అనంతరం అల్లరి నరేష్ 'నాంది' చిత్రంతో మంచి కమ్‌బ్యాక్ ఇచ్చారు. అయితే ఆ తర్వాత ఆయనకు ఆశించిన స్థాయి విజయాలు దక్కలేదు. ఈ నేపథ్యంలో భారీ వ్యయంతో తెరకెక్కుతున్న 'రంభ ఊర్వశి మేనక' చిత్రం నరేష్ కెరీర్‌కు ఎంతవరకు ఉపయోగపడుతుందో, ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో అనే ఆసక్తి సినీ వర్గాల్లో నెలకొంది.

Next Story