Hrithik Roshan: డైరెక్టర్‌గా మారిన స్టార్ హీరో.. భయంగా ఉందంటూ కామెంట్స్

by Chukka Sudharani |

బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరో హృతిక్ రోషన్ (Hrithik Roshan) త్వరలో ‘వార్-2’ (War-2)తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు.

Hrithik Roshan: డైరెక్టర్‌గా మారిన స్టార్ హీరో.. భయంగా ఉందంటూ కామెంట్స్
X

దిశ, సినిమా: బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరో హృతిక్ రోషన్ (Hrithik Roshan) త్వరలో ‘వార్-2’ (War-2)తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు. టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ (NTR) ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి అయాన్ ముఖేర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. భారీ అంచనాల మధ్య ఈ మూవీ సమ్మర్ స్పెషల్‌గా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధం అవుతోంది. ఇక ఈ మూవీ తర్వాత హృతిక్ క్రిష్-4పై ఫోకస్ పెట్టనున్నట్లు తెలుస్తుంది. తాను హీరోగా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ‘క్రిష్’ ఫ్రాంచైజీలో భాగంగా రాబోతున్న ఈ క్రిష్-4 (Krrish 4)కు హృతిక్ స్వయంగా దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాతో ఈ బాలీవుడ్ స్టార్ డైరెక్టర్‌గా మారబోతున్నాడు. దీంతో క్రిష్-4పై మూవీ లవర్స్‌లో హై ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి.

ఇందులో భాగంగా.. మొదటిసారి డైరెక్టర్‌గా మారడంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు హృతిక్. ‘నాకు చిన్నప్పటి నుంచే దర్శకత్వం(Direction)పై ఇంట్రెస్ట్ ఉంది. కానీ ఇందులోకి దిగిన తర్వాత భయంగా ఉంది. మళ్లీ కొత్తగా స్కూల్‌(School)లో అడుగుపెట్టినట్లు అనిపిస్తోంది. ఎందుకంటే ఇది నాకు పూర్తిగా కొత్త రంగం. దర్శకుడిగా ఎన్నో సవాళ్లు(Challenges) ఎదురవుతాయి. ఎంతో పరిశోధన చేయాలి. అంతే కాదు కొన్నిసార్లు ఈ మార్గాన్ని ఎందుకు ఎంచుకున్నాను అని కూడా అనిపించవచ్చు. అయినా ఈ సవాళ్లను ఎదర్కొనేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. అందుకే డైరెక్టర్‌గా నా ప్రస్థానం మొదలుపెడుతున్నా. మీ అందరి ప్రేమ(love), సపోర్ట్‌(support)ను ఎప్పటికీ మర్చిపోను.. ఎప్పటికీ అలాగే ఉంటాయని ఆశిస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు.

Next Story