- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అఖిల్ పెళ్లి అంత సింపుల్ గా చేశారా.. నాగార్జునపై ట్రోలింగ్ ?
అక్కినేని నాగార్జున ( Akkineni Nagarjuna) రెండవ కుమారుడు అఖిల్ అక్కినేని ( Akhil Akkineni) వివాహం ( Marriage) జూన్ 6వ

దిశ, వెబ్ డెస్క్ : అక్కినేని నాగార్జున ( Akkineni Nagarjuna) రెండవ కుమారుడు అఖిల్ అక్కినేని ( Akhil Akkineni) వివాహం ( Marriage) జూన్ 6వ తేదీన జరిగిన సంగతి తెలిసిందే. అఖిల్ అక్కినేని, జైనాబ్ ( Jainab) వివాహం.. జూబ్లీహిల్స్ లోని నాగార్జున ఇంట్లో జూన్ ఆరవ తేదీన తెల్లవారు జామున 3 గంటలకు జరిగింది. ఈ కార్యక్రమానికి కేవలం అక్కినేని నాగార్జున దగ్గరి మిత్రులు, కుటుంబ సభ్యులు, కొంతమంది సినీ తారలు మాత్రమే వచ్చారు.
చాలా గ్రాండ్ గా నిర్వహించకుండా సింపుల్ గానే... అఖిల్ అక్కినేని వివాహాన్ని జరిపించారు అక్కినేని నాగార్జున. అయితే ఆదివారం రోజున.. అంటే ఇవాళ సాయంత్రం రిసెప్షన్ జరిగే అవకాశాలు ఉన్నాయి. అది కూడా అన్నపూర్ణ స్టూడియోలో ఈ రిసెప్షన్ కార్యక్రమం ఉండబోతోంది. అయితే అక్కినేని అఖిల్ వివాహాన్ని సింపుల్ గా చేయడం పై సోషల్ మీడియాలో రకరకాలుగా కామెంట్స్ వినిపిస్తున్నాయి.
అఖిల్ అక్కినేని పెళ్లికి కేవలం రెండు కోట్లు మాత్రమే అక్కినేని నాగార్జున ఖర్చు పెట్టాడని సెటైర్లు పేల్చుతున్నారు కొంత మంది. 3000 కోట్లకు పైగా ఆస్తులు ఉన్న అక్కినేని నాగార్జున.. తన కొడుకు పెళ్లిని ఇంత సింపుల్ గా చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి మరి వైరల్ చేస్తున్నారు. అయితే రిసెప్షన్ మాత్రం నాగార్జున చాలా గ్రాండ్ గా నిర్వహించేందుకు ప్లాన్ చేసినట్లు సమాచారం అందుతుంది.






