‘సంక్రాంతికి వస్తున్నాం’ వన్ వీక్ కలెక్షన్స్ ఎంతంటే..? అస్సలు ఊహించి ఉండరుగా(పోస్ట్)

by Gugulothu.Kavitha |

విక్టరీ వెంకటేష్(Venkatesh), అనిల్ రావిపూడి(Anil Ravipudi) కాంబోలో వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranthiki vasthunnam) మూవీ జనవరి 14న థియేటర్లలో రిలీజై బ్లాక్ బస్టర్ హిట్‌ టాక్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.

‘సంక్రాంతికి వస్తున్నాం’ వన్ వీక్ కలెక్షన్స్ ఎంతంటే..? అస్సలు ఊహించి ఉండరుగా(పోస్ట్)
X

దిశ, సినిమా: విక్టరీ వెంకటేష్(Venkatesh), అనిల్ రావిపూడి(Anil Ravipudi) కాంబోలో వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranthiki vasthunnam) మూవీ జనవరి 14న థియేటర్లలో రిలీజై బ్లాక్ బస్టర్ హిట్‌ టాక్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాతలు దిల్ రాజు(Dil Raju), శిరీష్(Shirish) రూపొందించారు. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌లో మీనాక్షి చౌదరీ(Meenakshi Chowdary), ఐశ్వర్య రాజేశ్(Aishwarya Rajesh), వీకే నరేష్, వీటీ గణేష్, సాయి కుమార్, పమ్మి సాయి, సర్వదమన్ బెనర్జీ తదితరులు నటించారు. అయితే విడుదల అయిన స్టార్టింగ్‌ డే నుంచి కలెక్షన్ల విషయంలో బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్లు రాబడుతోంది ఈ సినిమా.

ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ వన్ వీక్ కలెక్షన్లను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇక సంక్రాంతికి వస్తున్నాం కలెక్షన్ల వివరాల్లోకెళ్తే.. ఈ సినిమా కేవలం 7 రోజుల్లోనే రూ. 203 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఈ మేరకు మేకర్స్ ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ పోస్ట్ పెట్టారు. ఇలా 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాతో వెంకీ మామ తన కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ సొంతం చేసుకున్నారు. సోలో హీరోగా అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా నిలిచిపోయింది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Next Story