రామ్ చరణ్ ‘పెద్ది‘ మూవీలోని చికిరి చికిరి సాంగ్‌కి ఎన్ని మిలియన్ల వ్యూస్ వచ్చిందంటే..? ట్వీట్ వైరల్

by I. Sairam |   (  Updated:2025-11-17 06:19:32  IST  )

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ పెద్ది.

రామ్ చరణ్ ‘పెద్ది‘ మూవీలోని చికిరి చికిరి సాంగ్‌కి ఎన్ని మిలియన్ల వ్యూస్ వచ్చిందంటే..? ట్వీట్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ పెద్ది. బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ, అతిలోక సుందరి తనయురాలు జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఇందులో దివ్యేందు శర్మ, జగపతి బాబు, శివరాజ్ కుమార్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్‌లో పీరియాడికల్ విలేజ్ స్పోర్ట్స్ డ్రామాగా రాబోతున్నఈ మూవీను మైత్రి మూవీ మేకర్స్, క్రియేటివ్ జీనియస్ సుకుమార్ ప్రొడక్షన్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 27న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది.

ఇదిలా ఉంటే.. రీసెంట్‌గా పెద్ది మూవీలో నుంచి ‘చికిరి చికిరి’ సాంగ్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్ మాస్ స్టెప్స్ అండ్ జాన్వీ ఘాటు అందాలతో పిచ్చెక్కిన ఈ సాంగ్ యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతుంది. ఈ క్రమంలో తాజాగా వృద్ధి సినిమాస్ ఈ సాంగ్ గురించి ఓ ట్వీట్ చేసింది. ‘చికిరి చికిరి సాంగ్ 1.44 మిలియన్+ లైక్‌లతో యూట్యాబ్‌లో 75 మిలియన్ + వీక్షణల మైలురాయిని దాటింది.. విడుదల అయినప్పటి నుండి YouTubeలో #1 ట్రెండింగ్‌లో ఉన్న పాట.. పెద్ది మూవీ ప్రపంచవ్యాప్తంగా 27 మార్చి, 2026న విడుదల కానుంది’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది.

Next Story