మన శంకర వరప్రసాద్ గారు' రెండు రోజుల్లో ఎన్ని కోట్ల కలెక్షన్ రాబట్టిందంటే..? పోస్ట్ వైరల్

by Gugulothu.Kavitha |   (  Updated:2026-01-14 08:28:42  IST  )

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వంలో తెరకెక్కిన ‘మన శంకర వర ప్రసాద్‌గారు’ (mana shankara varaprasad garu)సినిమా జనవరి 12న రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ టాక్‌తో దూసుకుపోతోంది.

మన శంకర వరప్రసాద్ గారు రెండు రోజుల్లో ఎన్ని కోట్ల కలెక్షన్ రాబట్టిందంటే..? పోస్ట్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వంలో తెరకెక్కిన ‘మన శంకర వర ప్రసాద్‌గారు’ (mana shankara varaprasad garu)సినిమా జనవరి 12న రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ టాక్‌తో దూసుకుపోతోంది. ఇక ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్ పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మించారు.

లేడీ సూపర్ స్టార్ నయనతార(Nayanthara), క్యాథరీన్ హీరోయిన్లుగా నటించిన ఈ మూవీలో టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్(Venkatesh0 గెస్ట్ రోల్‌లో కనిపించారు. ఇక ఈ సినిమాకు ఫస్ట్ షో నుంచే హౌస్‌ఫుల్ బోర్డులు పడుతుండగా, ఫెస్టివల్ సీజన్‌కు తగ్గట్టు సినిమా థియేటర్లలో పండగ వాతావరణాన్ని తీసుకొచ్చింది. అలా సినిమా విడుదలైన రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద సునామీలా దూసుకెళ్తోంది.

ఈ క్రమంలో రెండో రోజుల్లో ఈ మూవీ రూ.120 కోట్లకు పైగా గ్రాస్ సాధించినట్లు మేకర్స్ తెలియజేశారు. “అందరికీ హ్యాపీ భోగి.. స్వాగ్ కా బాప్ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద వసూళ్లను సాధిస్తోంది.. 2 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ₹120 కోట్లు+ వసూళ్లు సాధించింది” అంటూ ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇక పోస్టర్‌లో చిరంజీవి స్టైలీష్‌గా గాగుల్స్ పెట్టుకొని కాలర్ ఎగర వేస్తున్నాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

READ MORE .....

మన శంకర వరప్రసాద్ గారు సక్సెస్ సెలబ్రేషన్స్.. ఆకట్టుకుంటున్న క్యూట్ ఫొటోస్

Next Story