అక్కడ ఏకాంతంగా గడుపుతోన్న హాట్ బ్యూటీ.. అది మనది కాదంటూ ఇంట్రెస్టింగ్ పోస్ట్

by Kodari Anjali |   (  Updated:2025-06-28 08:18:31  IST  )

హాట్ యాంకర్ అనసూయ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

అక్కడ ఏకాంతంగా గడుపుతోన్న హాట్ బ్యూటీ.. అది మనది కాదంటూ ఇంట్రెస్టింగ్ పోస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: హాట్ యాంకర్ అనసూయ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ బ్యూటీ బుల్లితెరపై యాంకర్గా కెరీర్ ప్రారంభించి.. వెండితెరపై అవకాశాలు దక్కించుకుంటోంది. ఏకంగా అగ్ర హీరోల సరసన అవకాశాలు కొట్టేసి భారీ క్రేజ్ సొంతం చేసుకుంటోంది. సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప రెండు భాగాల్లో కీలక పాత్రలో నటించి అనసూయ తన ప్రతిభ చాటింది.

సునీల్ కు భార్య పాత్రలో నటించి ప్రేక్షకుల్ని మెప్పించింది. గ్లోబల్ స్టార్ నటించిన రంగస్థలం సినిమాలో చరణ్కు అత్తగా నటించింది. ఈ మూవీతోనే అనసూయ గ్రాఫ్ ఒక్కసారిగా ఛేంజ్ అయ్యిందని చెప్పుకోవచ్చు. దీంతో హాట్ బ్యూటీగా వరుస అవకాశాలు లభించాయి. ప్రస్తుతం రంగమత్తకు అన్నీ కీలక రోల్లోనే అవకాశాలు వస్తున్నాయి. ఇకపోతే ఈ అమ్మడు తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. వెకేషన్స్‌కు వెళ్లినా ఫొటోలు, వీడియోలు కానీ.. అభిమానులతో పంచుకుంటుంది. అప్పుడప్పుడు భర్త, పిల్లలతో సరదాగా గడుపుతోన్న పిక్స్ కూడా షేర్ చేస్తుంటుంది.

ఒక సమయంలో హాట్ హాట్ ఫోజులతో కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటుంది. ఒక సమయంలో సంప్రదాయ లుక్ లో దర్శనమిచ్చి.. నెటిజన్ల చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తుంటుంది. తాజాగా అనసూయ ఏకాంతంగా, ప్రశాంతంగా గడుపుతోన్న ఫొటోలు పంచుకుని.. ‘‘భూమి మనది కాదు.. మనం భూమికి చెందినవారం అనే వాస్తవంలో పరిపక్వత తగ్గిపోతోంది’’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ హాట్ యాంకర పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.

Next Story