మన శంకర వరప్రసాద్ గారు నుంచి సాలిడ్ ట్రీట్.. హుక్ స్టెప్ లిరికల్ వీడియో రిలీజ్

by Naga Rani Yarlagadda |

మన శంకర వరప్రసాద్ గారు సినిమా నుంచి మేకర్స్ .. అభిమానులకు మరో సాలిడ్ ట్రీట్ ను అందించారు. హుక్ స్టెప్ అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు.

మన శంకర వరప్రసాద్ గారు నుంచి సాలిడ్ ట్రీట్.. హుక్ స్టెప్ లిరికల్ వీడియో రిలీజ్
X

దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి - అనిల్ రావిపూడి - నయనతార కాంబినేషన్లో వస్తోన్న మోస్ట్ అవైటెడ్ సినిమా మన శంకర వరప్రసాద్ గారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలో రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, టీజర్లు, ట్రైలర్ మంచి అంచనాలే క్రియేట్ చేశాయి. తాజాగా హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా గ్రాండ్ గా జరుపుకుంది. ఈ సందర్భంగా మేకర్స్ సినిమా నుంచి అభిమానులకు మరో సాలిడ్ ట్రీట్ ను అందించారు. హుక్ స్టెప్ అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు.

ఈ పాటలో చిరంజీవి వింటేజ్ చిరు లుక్ లో, అల్ట్రా కూల్ గా కనిపిస్తూ.. కొన్ని అదిరిపోయే స్టెప్స్ కూడా వేశారు. చిరంజీవి ఎవర్ గ్రీన్ హుక్ స్టెప్ ను కూడా వీడియోలో చూపించారు. దీంతో మెగా ఫ్యాన్స్ చాలా థ్రిల్ అవుతున్నారు. తమ అభిమాన హీరో నుంచి ఇలాంటి పాట రావడంతో.. పూర్తిగా పాటను బిగ్ స్క్రీన్ పై చూసేందుకు ఎదురుచూస్తున్నారు. మెగాస్టార్ హుక్ స్టెప్ లిరికల్ వీడియోనూ మీరు కూడా ఇక్కడ చూసి ఎంజాయ్ చేయండి.

Next Story