బాలయ్య హీరోయిన్ కు అవ‌మానం..న‌డుముపై చేతులు వేసి !

by velandi.Saikiran |   (  Updated:2026-03-31 01:00:37  IST  )

బాలయ్య హీరోయిన్ హ‌నీరోజ్ కు ఘోర అవ‌మానం ఎదురైంది. ఆమె న‌డుముపై ఓ వ్య‌క్తి చేసి అసభ్యంగా ప్ర‌వ‌ర్తించాడు.

బాలయ్య హీరోయిన్ కు అవ‌మానం..న‌డుముపై చేతులు వేసి !
X

దిశ‌, వెబ్ డెస్క్: అందాల తార హనీ రోజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె తెలుగులో చేసింది తక్కువ సినిమాల అయినప్పటికీ, పాపులారిటీ మాత్రం బాగానే దక్కించుకుంది. బోల్డ్ పాత్రలో ఎక్కువగా కనిపించే హనీ రోజ్, బాలయ్యతో కూడా స్క్రీన్ షేర్ చేసుకుంది. అయితే అలాంటి బాలయ్య హీరోయిన్ హనీ రోజ్ కు ఊహించని షాక్ తగిలింది. పబ్లిక్ అందరూ చూస్తుండగానే ఆమెను నడుముపై ఓ అపరిచితుడు చేతులు వేశాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

హనీ రోజ్ నడుముపై చేతులు

కేరళలో సోమవారం ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హీరోయిన్ హనీ రోజ్ వెళ్లారు. అయితే హనీ రోజ్ వస్తున్న నేపథ్యంలో జనాలు కూడా అక్కడికి భారీ సంఖ్యలో చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమె నడుముపైన అసభ్యంగా ఓ అపరిచితుడు తాకాడు. దీంతో అతన్ని బౌన్సర్లు లాగేశారు. ఈ క్రమంలోనే దారుణమైన ఆ వీడియో బయటకు వచ్చింది. ఇది చూసిన నెటిజెన్స్ రక రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. హీరోయిన్ వస్తే అలా అసభ్యంగా తాకడం మన సాంప్రదాయం కాదని ఫైర్ అవుతున్నారు. జనాలు ఎక్కువగా ఉన్నప్పుడు సెక్యూరిటీ పెంచాల్సిన అవసరం ఉందని కోరుతున్నారు.

Next Story