- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
HIT-3: ‘హిట్-3’ ట్రైలర్ రిలీజ్.. మోస్ట్ వైలెంట్ లుక్‌లో గూస్ బంమ్స్ తెప్పిస్తున్న నేచురల్ స్టార్
నేచురల్ స్టార్ నాని (Nani) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘హిట్-3’ (Hit-3). హిట్ ఫ్రాంచైజీలో రాబోతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: నేచురల్ స్టార్ నాని (Nani) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘హిట్-3’ (Hit-3). హిట్ ఫ్రాంచైజీలో రాబోతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తుండగా.. నాని సొంత బ్యానర్ వాల్ పోస్టర్ సినిమాతో కలిసి యూనిమస్ ప్రొడక్షన్స్‌పై ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్నారు. ఇక ఇందులో నాని అర్జున్ సర్కార్ (Arjun Sarkar) అనే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుండగా.. యంగ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) హీరోయిన్‌గా నటిస్తుంది.
ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన టీజర్, ఫస్ట్ లుక్ వంటి అప్‌డేట్స్‌కు సోషల్ మీడియాలో మంచి స్పందన లభించగా.. ‘హిట్-3’ ట్రైలర్ కోసం ప్రేక్షకులు ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ట్రైలర్‌ను గమనించినట్లయితే.. ‘సర్ క్రిమినల్స్ ఉంటే భూమిమీద 10ఫీట్స్ సెల్‌లో ఉండాలి.. లేదంటే భూమి కింద 6ఫీట్ హూల్‌లో ఉండాలి. బిహేవియర్ కరెక్షన్ అవ్వని ఏ క్రిమినల్ కూడా సొసైటీలో ఫ్రీగా తిరగడానికి వీల్లేదు. అలా ఫీల్ అవ్వడానికి పర్సనల్‌గా ఎఫెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు.. పోలీసోడైతే చాలు’ అని నాని చెప్పే మాస్ డైలాగ్‌తో ట్రైలర్ స్టార్ట్ అవుతుంది.
ఆ తర్వాత వచ్చే యాక్షన్ సీన్స్, విజువల్స్, మాస్ ఎలిమెంట్స్, లవ్ సీన్స్ అన్ని అన్ని సినిమాపై మరింత హైప్ పెంచేశాయి. అయితే ‘జనాల మధ్య ఉంటే అర్జున్, మృగాల మధ్య ఉంటే సర్కార్ అని పిలువు’ అని నాని చెప్పే డైలాగ్ ట్రైలర్‌కే మరో మలుపు అని చెప్పాల్సిందే. ఫైనల్‌గా నాని మోస్ట్ వైలెంట్ లుక్‌లో గూస్ బంమ్స్ తెప్పిస్తున్నాడనే చెప్పాలి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.






