హిస్టారికల్ ఎపిక్ NBK111 గ్రాండ్‌గా స్టార్ట్.. క్లాప్ కొట్టిన బ్లాక్ బస్టర్ డైరెక్టర్

by Chukka Sudharani |

హిస్టారికల్ ఎపిక్ NBK111 గ్రాండ్‌గా స్టార్ట్.. క్లాప్ కొట్టిన బ్లాక్ బస్టర్ డైరెక్టర్
X

దిశ, సినిమా: వరుస బ్లాక్‌బస్టర్లతో దూసుకెళ్తున్న గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ.. వీరసింహారెడ్డి సంచలన విజయం తర్వాత బ్లాక్‌బస్టర్ మేకర్ గోపీచంద్ మలినేనితో మరోసారి చేతులు కలిపిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరి కొలాబరేషన్‌లో రాబోతోన్న హిస్టారికల్ ఎపిక్ NBK111 చిత్రాన్ని ప్రతిష్టాత్మక వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై నిర్మాత వెంకట సతీష్ కిలారు గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. ఇందులో నయనతార హీరోయిన్‌గా నటిస్తుంది. సింహ, జై సింహా, శ్రీ రామరాజ్యం తర్వాత బాలకృష్ణ, నయనతార కలిసి నటిస్తున్న నాల్గవ చిత్రం ఇది. ఈ ప్రాజెక్టు తాజాగా హైదరాబాద్‌లో ఘనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ మంత్రులు అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్ స్క్రిప్ట్‌ను నిర్మాతలకు అందజేశారు. బాలకృష్ణతో అనేక బ్లాక్‌బస్టర్‌లను అందించిన దర్శకుడు బి గోపాల్ క్లాప్ కొట్టారు. బాలయ్య కుమార్తె తేజస్విని కెమెరా స్విచ్ ఆన్ చేశారు. మొదటి షాట్‌కు బోయపాటి శ్రీను, బాబీ, బుచ్చి బాబు సమిష్టిగా దర్శకత్వం వహించారు.

తొలిసారిగా హిస్టారికల్ డ్రామాలోకి అడుగుపెడుతున్న గోపిచంద్ మలినేని.. నందమూరి బాలకృష్ణను ఇప్పటివరకు చూడని ఓ కొత్త అవతార్ చూపించబోతున్నారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన స్పెషల్ పోస్టర్‌లో బాలకృష్ణ.. ఒక చేతిలో ఖడ్గం, మరో చేతిలో యాంకర్‌ పట్టుకుని అఖండమైన రాజసంతో కనిపించారు. గడ్డం, పొడవాటి జుట్టు, శక్తివంతమైన తీరుతో సమరశూరుడిలా అదరగొట్టారు. మిగిలిన తారాగణం, సాంకేతిక సిబ్బందికి సంబంధించిన వివరాలు మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.

Next Story