- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వార్ 2 దెబ్బ అదుర్స్....మొదటి రోజే కూలీ కలెక్షన్స్ ఢమాల్ ?
వార్ 2 సినిమా మొదటి రోజు కేవలం హిందీలో 37 కోట్లు వసూలు చేసే ఛాన్సులు ఉన్నట్లు వెల్లడించింది.

దిశ, వెబ్ డెస్క్: జూనియర్ ఎన్టీఆర్ (NR), హృతిక్ (Hrithik Roshan) కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ వార్ 2 (War 2). భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా ఆగస్టు 14వ తేదీన రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. అయితే ఇదే రోజున... సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కూలీ సినిమా కూడా రిలీజ్ కాబోతుంది. అయితే ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం వార్ 2 కంటే ఎక్కువ కూలీ సినిమా ఎక్కువ కలెక్షన్స్ రాబట్టే ఛాన్స్ ఉన్నట్లు చెబుతున్నారు.
అయితే ఇలాంటి నేపథ్యంలో కూలీ ( Coolie) సినిమాకు బాలీవుడ్ లో ఎదురు దెబ్బ తగిలి ఛాన్స్ లో ఉన్నట్లు ఓ మీడియా సంస్థ వెల్లడించింది. ఆగస్టు 14వ తేదీన రిలీజ్ అవుతున్న వార్ 2 సినిమా మొదటి రోజు కేవలం హిందీలో 37 కోట్లు వసూలు చేసే ఛాన్సులు ఉన్నట్లు వెల్లడించింది.
అలాగే... కూలీ సినిమా ఫస్ట్ డే హిందీలో కేవలం ఐదున్నర కోట్లు మాత్రమే వసూలు చేస్తుందని.. సదరు మీడియా సంస్థ స్పష్టం చేసింది. హృతిక్ హీరో ఉన్న నేపథ్యంలో వార్ 2 సినిమా హిందీలో ఎక్కువ కలెక్షన్స్ రాబట్టే ఛాన్స్ లో ఉన్నాయి. ఇదే విషయాన్ని ఆ మీడియా సంస్థ పేర్కొంది. అలాగే ప్రభాస్ హీరోగా వస్తున్న రాజా సాబ్ డిసెంబర్ ఐదో తేదీన రిలీజ్ కానుంది. ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు 12 కోట్లు హిందీలో వసూలు చేసే ఛాన్స్ ఉన్నట్లు పేర్కొంది.






