హిలేరియ‌స్‌గా ‘ఉప్పు కప్పురంబు’ ట్రైలర్.. పాతిపెట్టడానికి స్మశానం లేక నానా అవస్థలు పడుతున్న ప్రజలు..

by Gugulothu.Kavitha |

స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్(Keerthi Suresh), హీరో సుహాస్(Suhas) ప్రధాన పాత్రలో న‌టిస్తున్న తాజా చిత్రం ‘ఉప్పు కప్పురంబు’(Uppu Kappurambu).

హిలేరియ‌స్‌గా ‘ఉప్పు కప్పురంబు’ ట్రైలర్.. పాతిపెట్టడానికి స్మశానం లేక నానా అవస్థలు పడుతున్న ప్రజలు..
X

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్(Keerthi Suresh), హీరో సుహాస్(Suhas) ప్రధాన పాత్రలో న‌టిస్తున్న తాజా చిత్రం ‘ఉప్పు కప్పురంబు’(Uppu Kappurambu). ఐవీ శశి దర్శకత్వంలో రూపొందిన ఈ సెటైరికల్ కామెడీ డ్రామాను రాధికా ఎల్ నిర్మించారు. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో(Amazon Prime Video)లో జులై 4 నుంచి తెలుగుతో పాటు త‌మిళం, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో నేరుగా స్ట్రీమింగ్ కానుంది. ఈ సంద‌ర్భంగా తాజాగా ఈ మూవీ నుంచి ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు మేక‌ర్స్.

ఇక ట్రైల‌ర్‌ను చూస్తుంటే.. అమాయకురాలైన కీర్తి సురేష్.. వాళ్ల నాన్న చ‌నిపోవ‌డంతో గ్రామ పెద్దగా అధికారం చేప‌డుతుంది. ఈ క్ర‌మంలోనే ఆ గ్రామానికి ఒక వింత సంక్షోభం వ‌స్తుంది. ఊరిలో ఉన్న స్మశానంలో జ‌నాలు చ‌నిపోయి హౌజ్‌ఫుల్‌గా మారుతుంది. దీంతో ఇంకా నలుగురు చ‌నిపోయి పూడ్చి పెట్టేంతా స్థ‌లం మాత్ర‌మే మిగిలి ఉంటుంది. అయితే ఈ స‌మ‌స్య‌ను గ్రామ‌స్థులు ఎలా పరిష్కరించుకున్నారు అనేది ఈ సినిమా క‌థ‌. ఫైనల్‌గా ఎంతో ఫన్‌గా ఈ ట్రైలర్ సాగింది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రైలర్‌ను చూసేయండి.

Twitter Link

Next Story