- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Badmashulu: హిలేరియస్‌గా ‘బద్మాషులు’ టీజర్..
శంకర్ చేగూరి (Shankar Cheguri) దర్శకత్వంలో రూపొందున్న హిలేరియస్ ఎంటర్టైనర్ 'బద్మాషులు' (Badmashulu).

దిశ, సినిమా: శంకర్ చేగూరి (Shankar Cheguri) దర్శకత్వంలో రూపొందున్న హిలేరియస్ ఎంటర్టైనర్ 'బద్మాషులు' (Badmashulu). మహేష్ చింతల, విద్యాసాగర్ కారంపురి, మురళీధర్ గౌడ్ తదితరులు లీడ్ రోల్స్‌లో నటిస్తున్న ఈ చిత్రాన్ని తార స్టొరీ టెల్లర్స్ బ్యానర్‌పై B. బాలకృష్ణ, C. రామ శంకర్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఈ సినిమా ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ రాగా.. తాజాగా టీజర్ (Teaser)ని రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్ అవుట్ అండ్ అవుట్ హిలేరియస్ ఎంటర్‌టైన్మెంట్‌గా సాగింది. మహేష్ చింతల, విద్యాసాగర్ కారంపురి, మురళీధర్ గౌడ్ పాత్రలు విశేషంగా అలరించాయి. రూరల్ రూటెడ్ కథ, కథనం, కామెడీ చాలా ఆర్గానిక్‌గా ఉండగా.. టీజర్ సినిమాపై మంచి బజ్‌ని క్రియేట్ చేసింది.
ఇక టీజర్ లాంచ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా హాజరైన హీరో రాగ్ మయూర్ (Rag Mayur) మాట్లాడుతూ.. ‘చీఫ్ గెస్ట్‌గా కాదు ఒక మంచి ఫ్రెండ్‌గా వచ్చాను. మహేష్ అంటే నాకు చాలా ఇష్టం. తనది వండర్ ఫుల్ జర్నీ. విద్యసాగర్ మంచి నటుడు. రూటెడ్ డ్రామాలకి మంచి డిమాండ్ ఉంది. ఆడియన్స్ చాలా రిలేట్ చేసుకుంటున్నారు. సినిమా బండి, సివరపల్లిలోని వైబ్ 'బద్మాషులు' టీజర్‌లో కనిపించింది. టీం అందరికీ ఆల్ ది బెస్ట్. టీజర్ చాలా ఆర్గానిక్ అండ్ ఫన్నీగా ఉంది. ప్యూర్ కామెడీ ఉంది. ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను’ అని చెప్పుకొచ్చాడు.
Teeta Tirupathi & Massage Muthyalu..! Eeelu Saana Dangerous Kaani Hilarious💥#BADMASHULU TEASIR OUT NAVVU 🔥
— Suresh PRO (@SureshPRO_) February 12, 2025
— https://t.co/qgDuIg5oLh
And, The FFAN JAMPING STATS SUUN 🥳 pic.twitter.com/91wv2J3g9s






