ఆ హీరోతో శ్రీదేవి రొమాంటిక్ కెమిస్ట్రీ అదుర్స్

by Sujitha Rachapalli |

‘కోర్ట్’ హీరోయిన్ శ్రీదేవి నటిస్తున్న ‘హైకూ’ చిత్రం నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఏగన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ‘మిన్నల్ మురళి’ ఫేమ్ ఫెమీనా జార్జ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటుంది. యువ‌తీ యువ‌కుల్లోని అమాయ‌క‌త్వంతో కూడిన ప్రేమ‌.. విద్యార్థి జీవితంలో ఆశ‌లు

ఆ హీరోతో శ్రీదేవి రొమాంటిక్ కెమిస్ట్రీ అదుర్స్
X

దిశ, సినిమా : ‘కోర్ట్’ హీరోయిన్ శ్రీదేవి నటిస్తున్న ‘హైకూ’ చిత్రం నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఏగన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ‘మిన్నల్ మురళి’ ఫేమ్ ఫెమీనా జార్జ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటుంది. యువ‌తీ యువ‌కుల్లోని అమాయ‌క‌త్వంతో కూడిన ప్రేమ‌.. విద్యార్థి జీవితంలో ఆశ‌లు.. క‌నే క‌ల‌ల నేప‌థ్యంతో ఈ ఫీల్ గుడ్ రొమాంటిక్ డ్రామా రానుంది. రంగురంగుల కుర్చీలతో ఖాళీగా ఉన్న గ్యాలరీలో కూర్చున్న హీరో హీరోయిన్ మ‌న‌కు క‌నిపిస్తున్నారు. వారి మధ్య చ‌క్క‌టి కెమిస్ట్రీ మ‌న‌కు పోస్టర్‌లో అందంగా క‌నిపిస్తోంది. ఆకాశంలో క‌నిపించే ల‌వ్ సింబ‌ల్ టైటిల్‌ను సూచించే సున్నిత‌మైన భావాన్ని తెలియ‌జేస్తోంది. అలాగే హీరో హీరోయిన్ వెనుక‌గా క‌నిపిస్తోన్న ఫాలింగ్ సూన్ అనే లైన్ వారి ఎమోష‌న‌ల్ జ‌ర్నీని సూచిస్తోంది. విజ‌న్ సినిమా హౌస్ బ్యాన‌ర్‌ నిర్మిస్తున్న సినిమాకు యువరాజ్ చిన్నసామి రైటర్, డైరెక్టర్. కాగా హ‌రిహ‌ర‌న్‌తో క‌లిసి స్క్రీన్ ప్లే రాశారు. ‘బేబి’, ‘కోర్ట్’ చిత్రాల‌కు సంగీతాన్ని అందించిన విజ‌య్ బుల్గానిన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు.

Next Story