- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
IBOMMA రవి పాస్ పోర్ట్ సీజ్ చేశారో లేదా తెలపాలి: హైకోర్టు
ఐ-బొమ్మ సినిమా పైరసీ వెబ్ సైట్ కేసులో ఇమంది రవి పాస్ పోర్టు సీజే చేశారో లేదో తెలపాలంటూ హై కోర్టు పీపీని ఆదేశించింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో: ఐ-బొమ్మ సినిమా పైరసీ వెబ్ సైట్ కేసులో ఇమంది రవి పాస్ పోర్టు సీజే చేశారో లేదో తెలపాలంటూ హై కోర్టు పీపీని ఆదేశించింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. రవి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. విచారణకు సహకరించడానికి ఇమంది రవి సిద్ధంగా ఉన్నారని, బెయిల్ మంజూరు చేయాలని రవి తరుపు అడ్వకేట్ హైకోర్టు ధర్మాసనాన్ని అభ్యర్థించారు. మూడు నెలల నుంచి రవి జైలులోనే ఉన్నారని, ఇప్పటికే విచారణ కూడా పూర్తయిందని కోర్టుకు తెలిపారు.
రవికి కరేబియన్ దీవుల పౌరసత్వం ఉందని.. బెయిల్ ఇస్తే అక్కడికి వెళ్లిపోయే అవకాశం ఉందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వర్ రావు తన వాదనలు వినిపించారు. ఐబొమ్మ వెబ్సైట్కు సంబందించి ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఇప్పటికీ ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయని వాటిపై పోలీసులు దర్యాప్తు చేయాల్సి ఉందని పీపీ వివరించారు. పోలీసులు.. పిటిషనర్ పాస్ పోర్టును ఇప్పటికే సీజ్ చేశారని, ఈ తరుణంలో ఆయన ఎలా విదేశాలకు పారిపోతాడని రవి తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇరు వాదనలు పరిశీలించిన అనంతరం కోర్టు అడిగిన వివరాలు అందజేయాలని ఆదేశిస్తూ హై కోర్టు విచారణ వాయిదా వేసింది.






