కల్ట్ వెబ్ సిరీస్ కేసులో రాహుల్ సిప్లిగంజ్‌కు హైకోర్టు నోటిసులు

by Ajay Maddhiboyina |

'కల్ట్' వెబ్ సిరీస్ వివాదంలో ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ సహా పలువురికి రాష్ట్ర హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

కల్ట్ వెబ్ సిరీస్ కేసులో రాహుల్ సిప్లిగంజ్‌కు హైకోర్టు నోటిసులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: 'కల్ట్' వెబ్ సిరీస్ వివాదంలో ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ సహా పలువురికి రాష్ట్ర హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ సిరీస్‌లో అసభ్యకరమైన కంటెంట్, అభ్యంతరకర భాష ఉందంటూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన జస్టిస్ నాగేష్ భీమపాక,శుక్రవారం కీలక ఆదేశాలు జారీ చేశారు. పిటిషనర్ తరఫు అడ్వకేట్ ఇమ్మనేని రామారావు వినిపించిన వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం, స్పందించాలని ప్రతివాదులను ఆదేశించింది. ప్రతి వాదులుగా రాహుల్ సిప్లిగంజ్, 'కల్ట్' వెబ్ సిరీస్ దర్శకుడు, చిత్ర బృందంతో పాటు సోషల్ మీడియా దిగ్గజాలైన మెటా (ఫేస్‌బుక్ మాతృసంస్థ), గూగుల్‌లకు కోర్టు నోటీసులు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఈ అంశంపై తమ వాదనలను వినిపించాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. న్యాయవాది రామారావును వ్యక్తిగత నోటీసులు జారీ చేసేందుకు కూడా అనుమతించిన కోర్టు, తదుపరి విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది.

Next Story