‘హే భగవాన్’.. మరోసారి కామెడీతో విశ్వరూపం చూపించిన నరేశ్..

by Sujitha Rachapalli |   (  Updated:2026-01-29 04:15:47  IST  )

సుహాస్, శివానీ నగరం హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘హే భగవాన్’. నరేష్ కీలకపాత్రలో నటిస్తున్న సినిమాలో యాంకర్ స్రవంతి చొక్కారపు ప్రముఖ పాత్ర పోషించింది.

‘హే భగవాన్’.. మరోసారి కామెడీతో విశ్వరూపం చూపించిన నరేశ్..
X

దిశ, సినిమా : సుహాస్, శివానీ నగరం హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘హే భగవాన్’. నరేష్ కీలకపాత్రలో నటిస్తున్న సినిమాలో యాంకర్ స్రవంతి చొక్కారపు ప్రముఖ పాత్ర పోషించింది. గోపీ అచ్చర దర్శకత్వంలో త్రిశుల్‌ విజనరీ స్టూడియోస్‌ పతాకంపై బి.నరేంద్ర రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం టీజర్‌ రిలీజ్ కార్యక్రమాన్ని నిర్వహించిన మేకర్స్.. ఫిబ్రవరి 20న సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. బన్నీవాస్‌, వంశీ నందిపాటిల సక్సెస్‌ఫుల్‌ ద్వయం నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్‌పై ఈ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. కాగా ఈ కార్యక్రమానికి చిత్ర నిర్మాత బి.నరేంద్ర రెడ్డి. దర్శకుడు గోపీ అచ్చర, ప్రొడక్షన్‌ డిజైనర్‌ రామ్‌కుమార్‌, ఎడిటర్‌ విప్లవ్‌, డీవోపీ మహిరెడ్డి, వంశీ నందిపాటి, స్రవంతి చొక్కారపు, హీరో అఖిల్‌రాజ్‌, హీరోయిన్‌ తేజస్వీరావు, హీరో సుహాస్‌, హీరోయిన్‌ శివానీ నగరం, దర్శకుడు సాయి మార్తండ్‌, నటుడు సుదర్శన్‌, నిర్మాత రమణా రెడ్డిలు పాల్గొన్నారు.

READ MORE : ఆల్-టైమ్ రీజినల్ ఇండస్ట్రీ బ్లాక్‌బస్టర్‌గా ‘మన శంకర వర ప్రసాద్ గారు’

Next Story