ఈ హీరోయిన్స్ ఫేవరెట్ ఫుడ్ తెలిస్తే షాక్ అవుతారు!

by Yella Dhawani Reddy |

హీరోయిన్లు అంటే అందాన్ని.. ఫిజిక్‌ను మెంటైన్ చేస్తుంటారు.

ఈ హీరోయిన్స్ ఫేవరెట్ ఫుడ్ తెలిస్తే షాక్ అవుతారు!
X

దిశ, వెబ్ డెస్క్: హీరోయిన్లు అంటే అందాన్ని.. ఫిజిక్‌ను మెంటైన్ చేస్తుంటారు. అందుకోసం, తప్పనిసరిగా ప్రత్యేకమైన డైట్ కూడా ఫాలో అవుతుంటారు. అయితే ఎవరైనా ఎంత డైట్ ఫాలో అయినా ఛీట్‌ డే రోజునో లేదంటే టూర్లకు వెళ్లినప్పుడో కొత్త రుచులు, వింతైన కాంబినేషన్లను ప్రయత్నిస్తుంటారు. అలా మన హీరోయిన్లకు ఇష్టమైన వింత ఫుడ్ కాంబినేషన్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

సాయి పల్లవి:

సాధారణంగా ఏ బాబా గుడికో, శివాలయానికో వెళ్లినప్పుడు భక్తులు కాస్త విభూతి తీసుకొని నోట్లో వేసుకుంటారు. కానీ దీన్ని ఓ ఆహార పదార్థంగా సాయి పల్లవి స్వీకరిస్తుందట. తనకు రోజూ విభూతి తినే అలవాటుందని తెలిపింది. దానిని ఒక ప్రత్యేకమైన చెట్టుతో తయారు చేస్తారని, అది తింటి ఒక రకమైన సాంత్వన చేకూరుతుందని చెబుతుంది.

రష్మిక మందన్న:

నేషనల్ క్రష్ రష్మికకు వెరైటీ ఫుడ్‌ కాంబినేషన్స్‌ ప్రయత్నించటం అంటే ఇష్టమట. బిరియానీ-రసం, పెరుగన్నం-బంగాళాదుంప చిప్స్‌, చిప్స్‌-నూడుల్స్‌.. వంటివి తరచూ ప్రయత్నిస్తానంటోంది ఈ పుష్ప భామ.

మృణాలు ఠాకూర్:

చాలా మంది అన్నంలో నెయ్యి, పెరుగు, వెన్న.. వంటివి వేసుకొని తింటారు. కానీ, మృణాళ్‌ ఠాకూర్‌ మాత్రం వెనీలా ఐస్‌క్రీమ్‌ కలుపుకొని తినడం తన ఫేవరెట్‌ అంటోంది. అంతేకాదు, పిజ్జా-అప్పం, పైనాపిల్‌-కెచప్‌.. వంటి కాంబినేషన్లు కూడా తనకు ఇష్టమని చెబుతోంది. జిమ్ వెళ్లే ముందు బ్లాక్ కాఫీ- బనానా ప్రి వర్కవుట్ మీల్‌గా తీసుకుంటానని అంటోంది.

జాన్వీ కపూర్:

సాధారణంగా మాంసాహారాన్ని ఇష్టపడే వారు చికెన్‌, మటన్‌, చేపలు, రొయ్యలు తింటుంటారు. కానీ అందాల తార జాన్వీ కపూర్‌ మాత్రం నత్తల కూరంటే భలే ఇష్టమంటోంది. అలాగే ఇడ్లీలను చికెన్‌ కర్రీలో నంజుకొని తినడమంటే ఇష్టమట.

తాప్సీ:

ఏదైనా పర్యటక ప్రదేశాలకు వెళ్లినప్పుడు అక్కడి పాపులరైన ఓ వెరైటీ వంటకాన్ని తప్పకుండా రుచి చూస్తానంటోంది తాప్సీ. అలా ఓసారి చైనా వెళ్లినప్పుడు నూనెలో వేయించిన గొల్లభామలు తిన్నదట. అప్పట్నుంచి ఈ వంటకం తన ఫేవరెట్‌గా మారిపోయిందని తెలిపింది.

Next Story