నటిగా రాణిస్తూనే నిర్మాతలుగా సక్సెస్ హీరోయిన్స్..

by Chukka Sudharani |

ఇండస్ట్రీలో ఇప్పుడు చాలా మంది హీరోయిన్స్.. నటనకు మాత్రమే పరిమితం కాకుండా బిజినెస్‌లు స్టార్ట్ చేస్తూ ఫ్యాన్స్‌ను అబ్బురపరుస్తున్నారు.

నటిగా రాణిస్తూనే నిర్మాతలుగా సక్సెస్ హీరోయిన్స్..
X

దిశ, సినిమా: ఇండస్ట్రీలో ఇప్పుడు చాలా మంది హీరోయిన్స్.. నటనకు మాత్రమే పరిమితం కాకుండా బిజినెస్‌లు స్టార్ట్ చేస్తూ ఫ్యాన్స్‌ను అబ్బురపరుస్తున్నారు. ఈ క్రమంలోనే చిత్ర పరిశ్రమలో హీరోయిన్లుగా రాణిస్తూనే నిర్మాతలుగా మారి సక్సెస్ అందుకుంటున్నారు. ఒకపక్క నటిస్తూ సినిమాలను నిర్మిస్తున్న హీరోయిన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

సమంత: టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న వారిలో సమంత ఒకరు. అయితే మయోసైటిస్ తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఈ హీరోయిన్ ప్రజెంట్ నిర్మాతగా మారి సక్సెస్ అందుకుంటుంది. ఈ మేరకు ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ అనే ప్రొడక్షన్ హౌస్‌ను స్టార్ట్ చేసి రీసెంట్‌గా ‘శుభం’ అనే సినిమాను నిర్మించి సక్సెస్ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో సమంత కూడా ఓ కీ రోల్‌లో కనిపించి మెప్పించింది.

నిహారిక కొణిదెల: యాంకర్‌గా బుల్లితెరకు పరిచయమైన మెగా డాటర్ నిహారిక కొణిదెల.. నటన మీద ఇంట్రెస్ట్‌తో ‘ముద్దపప్పు ఆవకాయ్’ సినిమాతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చింది. తర్వాత పలు సినిమాల్లో నటించి నటన పరంగా మంచి మార్కులో సొంతం చేసుకున్నప్పటికీ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకోలేక పోయింది. ఇక ఇండస్ట్రీ మీద ఇంట్రెస్ట్‌తో నిర్మాతగా మారిన నిహారిక ‘పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్’ స్టార్ట్ చేసి.. మొదటి చిత్రం (కమిటీ కుర్రాళ్లు)తోనే విజయాన్ని అందుకుంది. తన నిహారిక తన బ్యానర్‌పై రెండో సినిమా ప్రొడక్షన్ నెం.2 పేరుతో స్టార్ట్ చేసింది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి పూజాకార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి.

నయనతార : లేడీ సూపర్ స్టార్‌గా సినీ పరిశ్రమలో దూసుకుపోతున్న నయనతార.. ప్రజెంట్ వరుస సినిమాలు చేస్తూ సందడి చేస్తుంది. ఇక తర్వలో ఈ బ్యూటీ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధం అవుతున్నది. ఇక సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ హీరోయిన్‌గా సత్తా చాటుతున్న నయనతార.. రౌడీ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌తో కలిసి తన భర్త నిర్మాత, డైరెక్టర్ విగ్నేష్ శివన్‌కు పార్టనర్‌షిప్‌గా కో ప్రొడ్యూసర్‌గా మారిన సంగతి తెలిసిందే. నయనతార నిర్మాతగా మూకుతి అమ్మన్, ఇష్టం, వర్గల్, కవిన్ ఫిలిమ్ (పోస్ట్ ప్రొడక్షన్‌లో) అండ్ టెస్ట్ ఉన్నాయి.

జ్యోతిక : తెలుగులో ‘చంద్రముఖి’తో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న జ్యోతిక ప్రజెంట్ సెకండ్ ఇన్నింగ్స్‌లోనే సినిమాల్లో నటిస్తూ సక్సెస్‌ను అందుకుటుంది. అలాగే ఇప్పుడు తన భర్త తమిళ స్టార్ సూర్య స్టార్ట్ చేసిన 2D ఎంటర్‌టైన్మెంట్స్‌కు కో ప్రొడ్యూసర్ వ్యవహరిస్తూ జై భీమ్ లాంటి మంచి ప్రాజెక్టులు చేస్తోంది.

నజ్రియా నజీమ్ : టీవీ యాంకర్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసి.. నటిగా ఎదిగి ఇప్పుడు ప్రొడ్యూసర్‌గా కూడా కొనసాగిస్తున్న నటి నజ్రియా నజీమ్. నజ్రియా తన సొంత పేరుతో ‘నజీయ్ ప్రొడక్షన్స్’ స్టార్ట్ చేసి.. సినిమాలను నిర్మిస్తుంది. ఈ సంస్థలో నజ్రియా నిర్మించిన మొదటి చిత్రం ‘అంతఃపురం’.

ఛార్మీ కౌర్ : ఒకప్పుడు స్టార్ నటిగా ఫుల్ స్వింగ్‌లో ఉన్న ఛార్మీ.. తర్వాత సినీ కెరీర్‌లో ఎన్నో ఒడిదొడుకులను చూసింది. ఇప్పుడు నటనకు పూర్తిగా దూరమైన ఛార్మీ నిర్మాతగా మారింది. డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌తో కలిసి కో ప్రొడ్యూసర్‌గా సినిమాలు తీస్తున్నారు. ఈ క్రమంలోనే వచ్చిన ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకోగా.. డబుల్ ఇస్మార్ట్, లైగర్ వంటి సినిమాలు డిజాస్టర్‌గా నిలిచాయి. ఇక ఇప్పుడు పూరీ జగన్నాథ్ డైరెక్టర్‌లో విజయ్ సేతుపతి హీరోగా.. ఛార్మీ నిర్మాతగా మరో మూవీ వస్తుంది.

వీళ్లు మాత్రమే కాకుండా నిత్యా మీనన్, అమలాపాల్, తాప్సీ, ఆలియా భట్, దీపికా పదుకొణె, ప్రియాంక చోప్రా, కరీనా కపూర్, కంగనా రనౌత్, కృతి సనన్, రిచా చద్దా, మాధురి దీక్షిత్ తదితరులు హీరోయిన్స్‌గా సినిమాలు తీస్తూనే నిర్మాతలుగా కూడా పలు సినిమాలు తెరకెక్కిస్తూ సక్సెస్‌ను అందుకుంటున్నారు.

Next Story