- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Yami Gautam : ఆమె తన హక్కుల కోసం పోరాడుతుంది.. ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చిన యామీ గౌతమ్
బాలీవుడ్ బ్యూటీ యామీ గౌతమ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘హక్’.

దిశ, సినిమా: బాలీవుడ్ బ్యూటీ యామీ గౌతమ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘హక్’. 1985లో జరిగిన షాబానో కేసు ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమా.. ఫుల్ కోర్టు డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. యామీ గౌతమ్, ఇమ్రాన్ హష్మీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న దీనికి.. ‘రాణా నాయుడు’ అండ్ ‘ది ట్రయల్’ ఫేమ్ డైరెక్టర్ సుపర్ణ్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ‘హక్’ రిలీజ్ డేట్ ప్రకటించింది యామీ గౌతమ్. ‘ఆమె తన హక్కుల కోసం పోరాడుతుంది.. అతను తన నమ్మకాలను కాపాడుకుంటాడు.. ఈ నవంబర్ 7న హక్ సినిమా థియేటర్లలో విడుదలవుతోంది’ అంటూ ఓ పోస్టర్ షేర్ చేసింది. ఇందులో యామీ కోర్టు రూమ్‌లో ఉండగా.. తన ఎదురుగా న్యాయమూర్తులు ఉన్నారు. కాగా.. ఈ చిత్రం నుంచి ఇటీవల వచ్చిన టీజర్‌కు మంచి స్పందన లభించింది. ఇందులో ‘నేను కేవలం ముస్లిం మహిళను కాదు.. హిందూస్థాన్‌కు చెందిన ముస్లిం మహిళను. నేను ఈ దేశానికి చెందినదానిని.. అందుకే చట్టం ఈ దేశంలోని మిగిలిన వ్యక్తులతో ఎలా వ్యవహరిస్తుందో అలాగే నన్ను కూడా చూడాలి’ వంటి డైలాగ్స్ సినిమాపై క్యూరియాసిటీని పెంచాయి. లింక్
- Tags
- Yami Gautam
- Haq






