- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Sumaya Reddy: నటించడం సులభం.. నిర్మాతగా ఉండటం చాలా కష్టం.. యంగ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

దిశ, సినిమా: తెలుగమ్మాయి అయిన సుమయ రెడ్డి (Sumaya Reddy) హీరోయిన్‌గా, నిర్మాతగా, రచయితగా వ్యవహరిస్తున్న సినిమా ‘డియర్ ఉమ’ (Dear Uma). పృథ్వీ అంబర్ మీరోగా నటిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 18న రాబోతోంది. సాయి రాజేష్ మహాదేవ్ దర్శకత్వం వహిస్తు్న్న ఈ చిత్రం రిలీజ్ టైమ్ దగ్గర పడటంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచారు చిత్ర బృందం. ఇందులో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హీరోయిన్ సుమయ రెడ్డి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంది.
‘కరోనా టైంలో నాకు ప్రతీ రోజూ ఓ కల వస్తూనే ఉండేది. అది నన్ను వెంటాడుతూ ఉన్నట్టుగా అనిపించింది. అలా ఆ కలలో వచ్చిన పాయింట్ మీదే కథను రాసుకున్నాను. అందరికీ కనెక్ట్ అయ్యేలా మా చిత్రం ఉంటుంది. ఇందులో కార్పొరేట్ హాస్పిటల్స్‌లో జరిగే వాటిని చూపించబోతున్నాం. డాక్టర్లు, పేషెంట్స్‌కి మధ్యలో ఉండే పర్సన్స్ సరిగ్గా లేకపోతే ఏం జరుగుతుందో చూపిస్తాం. ఈ చిత్రం కాస్త ఫిక్షనల్‌గా కాస్త రియల్‌గా ఉండబోతుంది. సోషల్ మెసెజ్ అని కాకుండా ఓ సొల్యూషన్‌ని కూడా చెబుతాం. అందరికీ అవగాహన కల్పించేలా చిత్రం ఉంటుంది. హీరోయిన్(Heroine)గా ఉండి నిర్మాతగానూ సినిమాను చేయాలని అనుకోలేదు. కానీ అలా చేయాల్సి వచ్చింది. నటించడం చాలా సులభం. నిర్మాత(Producer)గా ఉండటం చాలా కష్టం. అసలు ఒక్కోసారి ఎందుకు డబ్బులు ఖర్చు పెడుతున్నామో కూడా తెలీదు. కష్టపడి సంపాదించిన డబ్బు అంతా అలా వెళ్తుంటే బాధగానే ఉంటుంది. ఈ చిత్రం కోసం మేం అనుకున్న బడ్జెట్ కంటే చాలా ఎక్కువగా పెట్టేశాను. ఈ మూవీ ఏప్రిల్ 18న రాబోతోంది. అందరూ తప్పకుండా చూసి ఆదరించండి’ అంటూ చెప్పుకొచ్చింది.