Shruti Haasan: అనుకునేవాళ్లు చాలా అనుకుంటారు.. కానీ నాకు నచ్చిందే నేను చేస్తా.. హీరియిన్ షాకింగ్ కామెంట్స్

by Chukka Sudharani |

మల్టీ టాలెంటెడ్‌గా ఇండస్ట్రీలో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది శృతి హాసన్ (Shruti Haasan).

Shruti Haasan: అనుకునేవాళ్లు చాలా అనుకుంటారు.. కానీ నాకు నచ్చిందే నేను చేస్తా.. హీరియిన్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: మల్టీ టాలెంటెడ్‌గా ఇండస్ట్రీలో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది శృతి హాసన్ (Shruti Haasan). ప్రస్తుతం ఈ అమ్మడు భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ సందడి చేస్తుంది. ఈ క్రమంలోనే త్వరలో ‘కూలీ’(coolie) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతోంది. సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth), లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) కాంబినేషన్‌లో రాబోతున్న ఈ మూవీని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఇందులో ఉపేంద్ర, నాగార్జున, సాబిన్ షాహిర్, శ్రుతి హాసన్, ఆమిర్ ఖాన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ అన్నీ ఆకట్టుకోగా.. భారీ అంచనాల మధ్య కూలీ చిత్రం ఆగస్టు-14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా వరుస ఇంటర్వ్యూస్‌లో పాల్గొంటోన్న శృతిహాసన్‌కి ఓ ప్రశ్న ఎదురైంది. కూలీ సినిమాలో హీరోయిన్ కానప్పటికీ కీలక పాత్ర చేస్తున్న ఈ అమ్మడుని.. ఏజ్‌లో పెద్దైనా హీరోలతో ఎందుకు నటిస్తున్నారు అని ప్రశ్నించగా.. ‘మూవీలో పాత్రలను చూడాలి.. వారి మధ్య ఉన్న ఏజ్ కాదు. అయినా నాకు ఎవరి గురించి తెలియదు. నేను మాత్రం ఏజ్ విషయాన్ని పట్టించుకోను. ఇక మాట్లాకునే వారి సంగతి అంటారా.. వారు ఎలాంటి పాత్రలు చేసిన మాట్లాతారు. అందుకే అలాంటివి పట్టించుకోను. పాత్రకు ప్రాధాన్యం ఉంటే.. నాకు నటించే అవకాశం వస్తే కచ్చితంగా చేస్తా’ అని తెలిపింది.

Next Story