- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘అది ఎంత అద్భుతమైన రాత్రి’ అంటూ వీడియో పంచుకున్న అగ్ర హీరో కుమార్తె
హీరోయిన్ శృతి హాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

దిశ, వెబ్‌డెస్క్: హీరోయిన్ శృతి హాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ బ్యూటీ పవర్‌స్టార్ పవన్ కల్యాన్ అండ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వంటి అగ్ర హీరోల సరసన నటించి మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. శృతి హాసన్ నటించిన సినిమాలు చాలా వరకు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినవేనని చెప్పుకోవచ్చు. అనగనగా ఓ ధీరుడు మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ హీరోయిన్ తర్వాత వరుస అవకాశాలు అందుకుని.. వరుస హిట్లు కొట్టింది. ప్రేక్షకుల్లో మంచి ఫేమ్ సంపాదించుకుంది.
అప్పట్లో శృతి హాసన్ ఓ మూవీ చేస్తుందంటే పక్కా హిట్ కొడుతుందనే భావన ప్రేక్షకుల్లో ఉండేది. తమ సినిమాలో పెట్టుకునేందుకు దర్శక, నిర్మాతలు కూడా ముందుకొచ్చేవారు. తన ప్రతిభతో ఈ హీరోయిన్ కోట్ల మంది ఫ్యాన్స్ ను కూడా సొంతం చేసుకుంది. ప్రస్తుతం శృతి హాసన్‌కు అవకాశాలు తగ్గుముఖం పట్టాయని చెప్పుకోవచ్చు.
ఇకపోతే ఈ హీరోయిన్ సోషల్ మీడియాలో తరచూ ఏదో ఒక పోస్టుతో అభిమానుల్ని ఆకట్టుకుంటుందన్న విషయం తెలిసిందే. కాగా తాజాగా ఈ ముద్దుగుమ్మ నెట్టింట ఓ పోస్ట్ పెట్టింది. సాంగ్ పాడుతోన్న వీడియో పంచుకుని.. :‘అది ఎంత అద్భుతమైన రాత్రి’’ అని ఓ క్యాప్షన్ కూడా జతచేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట నెట్టింట వైరల్ అవుతోంది.






