- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇన్నోసెన్స్‌తో పాటు కామెడీ కూడా.. 'హే బలవంత్'లో తన పాత్ర విశేషాలు పంచుకున్న హీరోయిన్ శివానీ నగరం
‘హే బలవంత్’ చిత్రంలో నా పాత్ర చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. ప్రేక్షకులు ఎంతో ఎంజాయ్ చేస్తారు అని చెప్పుకొచ్చింది శివాని నాగరం.

దిశ, సినిమా: సెన్సార్ బోర్డు అభ్యంతరాల మేరకు ‘హే భగవాన్’ చిత్రం ఇప్పుడు ‘హే బలవంత్’ అనే టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నది. నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్‌పై రాబోతున్న ఈ ఫుల్‌లెంగ్త్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌కు గోపీ అచ్చర దర్శకత్వం వహించాడు. సుహాస్, శివానీ నగరం, సీనియర్ నటుడు నరేష్, యాంకర్ స్రవంతి ప్రముఖ పాత్రల్ని పోషించారు. ఇక ఫిబ్రవరి 20న ఈ చిత్రం గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధంగా ఉండగా.. తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొని సినిమా విశేషాలు పంచుకుంది హీరోయిన్ శివానీ నగరం.
‘ఇది నా కెరీర్‌లో మూడో సినిమా. అంబాజీపేట మ్యారేజి బ్యాండు తర్వాత నేను సుహాస్‌తో నటిస్తున్న రెండో చిత్రం. అందులో నాది చాలా ఇంటెన్స్ క్యారెక్టర్. ఇంటెన్స్ స్టోరీ.. ఈ సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్ పాత్ర. చాలా ఎంజాయ్ చేస్తూ చేసిన పాత్ర నాది. సినిమా మొత్తం ఆడియన్స్ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అవుతారు. చివర్లో ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ కూడా అందర్ని అలరిస్తుంది. నాపాత్రలో ఇన్నోసెన్స్‌తో పాటు కామెడీ కూడా ఉంటుంది. సినిమా చాలా బాగుంటుంది. తప్పకుండా హిట్ అవుతుందనే నమ్మకం ఉంది. ఈ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాలో కలర్‌ఫుల్ విజువల్స్, మ్యూజిక్ బాగుంటుంది. ఇక సినిమా అంటే సినిమా అంతే. స్టార్ హీరోలు, చిన్న హీరోలు అని కాదు.. నాకు కథ, నా పాత్ర నచ్చితే ఒప్పుకుంటాను. . ఎటువంటి నేపథ్యం లేకుండా వచ్చాను. ఆడియన్స్ ఇచ్చిన వాల్యూను నిలుపుకోవటమే ముఖ్యం’ అని చెప్పుకొచ్చింది.
- Tags
- shivani nagaram






