చీరలో బాపు బొమ్మలా బాలయ్య బ్యూటీ

by Gugulothu.Kavitha |   (  Updated:2026-02-12 14:19:24  IST  )

సంయుక్త తన సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో స్లీవ్ లెస్ బ్లౌజ్ ఆరెంజ్ కలర్ శారీలో చాలా ట్రెడిషనల్‌గా రెడీ అయింది. మల్లెపూలు, బుట్టాలు, గాజులు, బొట్టు పెట్టుకొని బాపు బొమ్మలా కనిపించింది.

చీరలో బాపు బొమ్మలా బాలయ్య బ్యూటీ
X

దిశ, వెబ్‌డెస్క్: ‘భీమ్లా నాయక్’(Beemla Nayak) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన యంగ్ బ్యూటీ సంయుక్త మీనన్(Samyuktha Menon) గురించి మనందరికీ సుపరిచితమే. ఫస్ట్ సినిమాతోనే మంచి ఫేమ్ తెచ్చుకున్న ఈ చిన్నది తర్వాత వరుస ఆఫర్లు అందుకుంటూ మంచి క్రేజ్ సంపాదించింది. ఇక రీసెంట్‌గా బాలకృష్ణ(Balakrishna) సరసన ‘అఖండ-2’(Akhanda-2) మూవీలో యాక్ట్ చేసిన ఈ చిన్నది తాజాగా యంగ్ హీరో శర్వానంద్‌(Sharwanand)తో ‘నారి నారి నడుమ మురారి’(Nari Nari Naduma Murari) మూవీతో మన ముందుకు వచ్చింది.

సంక్రాంతి కానుకగా రిలీజ్ అయన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. మరోపక్క సోషల్ మీడియా(Social Media)లో కూడా బాగా యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా సంయుక్త తన సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో స్లీవ్ లెస్ బ్లౌజ్ ఆరెంజ్ కలర్ శారీలో చాలా ట్రెడిషనల్‌గా రెడీ అయింది.

మల్లెపూలు, బుట్టాలు, గాజులు, బొట్టు పెట్టుకొని బాపు బొమ్మలా కనిపించింది. ఇక చేతిలో కలువ పూలు పట్టుకున్న ఫొటోలు కూడా షేర్ చేసింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు కత్తిలా ఉన్నావంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ చిన్నదాని పోస్ట్ పై మీరు ఓ లుక్ వేసేయండి.

Read More..

ధనుష్‌తో పెళ్లి.. ఎట్టకేలకు అలాంటి వీడియోతో స్పందించి క్లారిటీ ఇచ్చిన మృణాల్.. పోస్ట్ వైరల్


Next Story