- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Samyuktha: ఫైనల్లీ బెంజ్‌లో హీరోయిన్ ఫిక్స్.. రాఘవ లారెన్స్ సరసన ఆ యంగ్ బ్యూటీ.. క్రేజీ పోస్టర్ వైరల్
మల్టీ టాలెంటెడ్ హీరో రాఘవ లారెన్స్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘బెంజ్’.

దిశ, సినిమా: మల్టీ టాలెంటెడ్ హీరో రాఘవ లారెన్స్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘బెంజ్’. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం అనౌన్స్ చేసినప్పటి నుంచి హీరోయిన్ విషయంలో ఎన్నో రూమర్స్ నెట్టింట సందడి చేశాయి. ఫైనల్‌గా BENZ లో హీరోయిన్‌ను ఫిక్స్ చేస్తూ అఫీషిల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు చిత్ర బృందం. ఇందులో యంగ్ బ్యూటీ సంయుక్త మీనన్‌ను హీరోయిన్‌గా ఫిక్స్ చేసినట్లు తెలుపుతూ అధికారికంగా ప్రకటించారు. తాజాగా సంయుక్త మీనన్ బర్త్‌డే కావడంతో ఆ సందర్భంగా.. ఆమె నటిస్తున్న సినిమాల నుంచి వరుస అప్డేట్స్ ఇచ్చారు.
ఇందులో రాఘవ లారెన్స్ బెంజ్ కూడా ఉండటం విశేషం. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అనతికాలంలోనే ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న సంయుక్త చేతిలో ప్రస్తుతం అఖండ-2, పూరీసేతుపతి, నారీ నారీ నడుమ మురారీ, హైందవ, స్వయంభు, బెంజ్ వంటి చిత్రాలు ఉన్నాయి. ఇక మహారాగ్ని అనే చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇస్తుంది సంయుక్త. తాజాగా ఆమె పుట్టిన రోజు కావడంతో.. ఈ హీరోయిన్ నటిస్తున్న సినిమాల నుంచి అఫీషియల్ అనౌన్స్‌మెంట్స్ రావడంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. లింక్






