Rupa Koduvayur: మీతో పాటు నేను కూడా వెయిట్ చేస్తున్నా.. ‘సారంగపానీ జాతకం’పై హీరోయిన్ కామెంట్స్

by Chukka Sudharani |

తెలుగు నటి రూప కొడువాయూర్ (Roopa Koduvayur) ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ సినిమాతో 2020లో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చింది.

Rupa Koduvayur: మీతో పాటు నేను కూడా వెయిట్ చేస్తున్నా.. ‘సారంగపానీ జాతకం’పై హీరోయిన్ కామెంట్స్
X

దిశ, సినిమా: తెలుగు నటి రూప కొడువాయూర్ (Roopa Koduvayur) ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ సినిమాతో 2020లో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చింది. తర్వాత ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ మూవీలో నటించిన ఈ అమ్మడు.. నటన పరంగా మంచి మార్కులే అందుకుంది. ఇప్పుడు ‘సారంగపాణి జాతకం’ (Sarangapani Jathakam) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతోంది. ప్రియదర్శి (Priyadarshi) ప్రదాన పాత్రలో నటిస్తున్న ఈ మూవీకి ఇంద్రగంటి మోహన కృష్ణ (Indraganti Mohana Krishna) దర్శకత్వం వహిస్తున్నారు. శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 18న విడుదల కానుంది. ఇక రిలీజ్ సమయం దగ్గర పడుతున్న క్రమంలోనే మీడియాతో ముచ్చటించారు చిత్ర బృందం.

ఇందులో భాగంగా హీరోయిన్ రూప కొడువాయూర్ సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ (Interesting comments) చేసింది. ‘ప్రియదర్శిలో అందరికి నచ్చేది తన కామెడీ టైమింగ్ (Comedy timing). ఈ సినిమాలో అది కంప్లీట్‌గా ఉంటుందని అందరూ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. మీ అందరిలాగే నేను కూడా ఇలాంటి మూవీ కోసం వెయిట్ చేస్తున్నా (Waiting). అందరూ ఎక్స్‌పెక్ట్ చేసినట్లు తన కామెడీ టైమింగ్‌తో ఫుల్‌గా ఎంటర్‌టైన్ చేయబోతున్నాడు ఈ ‘సారంగపాణి జాతకం’లో. ఈ సమ్మర్‌కి ఇది వేరీ కూల్ ఫిల్మ్. ఇది మీ మొత్తం కుటుంబాన్ని అలరిస్తుంది. వేసవిలో పరీక్షలు అయిన వెంటనే యువత చూడటానికి ఇది సరైన చిత్రం.. వెళ్లి చూడిండి.. ఎంటర్‌టైన్ అవ్వండి’ అంటూ చెప్పుకొచ్చింది హీరోయిన్.

Next Story