- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ritika Nayak: అల్లు అర్జున్‌పై మనసు పారేసుకున్న యంగ్ హీరోయిన్.. ఎలాంటి పాత్ర అయినా చేస్తానంటూ కామెంట్స్
‘మిరాయ్’ చిత్రం సక్సెస్‌తో క్రేజీ బ్యూటీగా మారిపోయింది యంగ్ హీరోయిన్ రితికా నాయక్.

దిశ, సినిమా: ‘మిరాయ్’ చిత్రం సక్సెస్‌తో క్రేజీ బ్యూటీగా మారిపోయింది యంగ్ హీరోయిన్ రితికా నాయక్. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ‘అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. నేచురల్ స్టార్ నాని ‘హాయ్ నాన్న’ మూవీలో లాస్ట్‌లో నాని కూతురుగా స్టేజ్‌పై సాంగ్ పాడుతూ కనిపించి ఆకట్టుకుంది. ఇక రీసెంట్‌గా తేజా సజ్జా ప్రధాన పాత్రలో నటించిన ‘మిరాయ్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ అందుకుంది.
ఈ సినిమాలో రితికా పాత్రకు ప్రశంసలు కురుస్తుండగా.. ప్రస్తుతం సోషల్ మీడియా క్రష్‌గా మారిపోయింది. ఇదిలా ఉంటే.. తాజాగా సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా రితికా నాయక్ చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి. ‘నాకు అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం. ఆయనతో నటించడం నా కల. ఆయన సినిమాలో ఎలాంటి పాత్ర అయినా సరే.. ఎలాంటి సినిమా అయినా సరే నేను నటించడానికి సిద్ధంగా ఉన్నాను.. ఆయనతో కలిసి నటించే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తాను’ అని తెలిపింది. ప్రజెంట్ ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.






