- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Riddhi Kumar: ప్రభాస్ సినిమాలో ఆఫర్ రావడాన్ని నమ్మలేదు.. యంగ్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్
రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న వరుస చిత్రాల్లో ‘ది రాజాసాబ్’ ఒకటి.

దిశ, సినిమా: రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న వరుస చిత్రాల్లో ‘ది రాజాసాబ్’ ఒకటి. పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతోన్న ఈ మూవీకి మారుతి దర్శకత్వం వహిస్తున్నాడు. హారర్ కామెడీ బ్యాక్‌డ్యాప్‌లో వస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇందులో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్‌తో పాటు రిద్ధి కుమార్ కూడా హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ట్రైలర్, టీజర్‌లో ఈ హీరోయిన్స్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్లొన్న హీరోయిన్ రిద్ధి కుమార్.. అసలు ఈ సినిమాలో తాను ఎలా భాగం అయిందో చెప్పుకొచ్చింది.
‘SKN నుండి కాల్ వచ్చింది.. మేము ప్రభాస్‌తో సినిమా చేస్తున్నాము.. అందులో మిమ్మల్ని హీరోయిన్‌గా కోరుకుంటున్నాము మీకు ఇష్టమేనా అని అడిగారు. అది వినగానే నేను ఫ్రాంక్ కాల్ అనుకున్నా. నా మేనేజర్‌తో వెరిఫై చేయడానికి ఫోన్ చేయించాను. అప్పుడు వాళ్లు “మీకు ప్రభాస్ తెలుసా?” అని అడిగారు. నేను "అవును!" అని అన్నాను. లుక్ టెస్ట్ ఇవ్వమంటే ఇచ్చాను.. ఆడిషన్ చేశారు.. దీంతో ఈ రోజు నేను ఇక్కడ ఉన్నాను.. నిజంగా దీన్ని నేను నమ్మలేకపోయాను.. ప్రభాస్ నటిస్తున్న ది రాజాసాబ్‌లో నేను భాగం కావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది’ అంటూ ఆనందం వ్యక్తం చేసింది రిద్ధి కుమార్. లింక్






