సినిమాలు వదిలేస్తా.. కానీ అలాంటి సీన్స్ కోసం దిగజారను !

by velandi.Saikiran |

సినిమాలు వదులుకుంటా.. కానీ తనకు నచ్చని సీన్స్ అస్సలు చేయబోనంటూ టాలీవుడ్ అగ్రశ్రేణి హీరోయిన్ రష్మిక సంచలన

సినిమాలు వదిలేస్తా.. కానీ అలాంటి సీన్స్ కోసం దిగజారను !
X

దిశ, వెబ్ డెస్క్ : సినిమాలు వదులుకుంటా.. కానీ తనకు నచ్చని సీన్స్ అస్సలు చేయబోనంటూ టాలీవుడ్ అగ్రశ్రేణి హీరోయిన్ రష్మిక సంచలన వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో చలో సినిమాతో అడుగుపెట్టిన హీరోయిన్ రష్మిక.. ఇప్పుడు ఇండస్ట్రీని ఏలుతున్నారు. తెలుగు ఒకటే కాదు.. తమిళ్, కన్నడ అలాగే బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఆమె రాణిస్తున్నారు.

పుష్ప, యానిమల్ సినిమాల తర్వాత ఆమె బ్రాండ్ మరింత పెరిగింది. అయితే అలాంటి హీరోయిన్ రష్మిక నటన విషయంలో కొన్ని కండిషన్స్ పెడుతున్నారు. సినిమాల విషయంలో తనకంటూ కొన్ని లిమిట్స్ పెట్టుకున్నట్లు తాజాగా పేర్కొన్నారు రష్మిక. రియల్ లైఫ్ లేదా సినిమాలలో అయినా సరే... తనకు స్మోక్ చేయడం అస్సలు నచ్చదని పేర్కొన్నారు.

అది తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే అని చెప్పుకొచ్చారు రష్మిక. తాను ఆన్ స్క్రీన్ లో కొన్ని పనులు చేయకూడదని హద్దులు పెట్టుకున్నాను... అందులో సిగరెట్ స్మోకింగ్ ఒకటి... అని తెలిపారు. స్మోకింగ్ సీన్స్ వస్తే... ఎంతటి సినిమా నైనా వదులుకుంటానని ప్రకటించారు. దీంతో రష్మిక చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

Next Story