- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘నాకు ఫిట్‌నెస్ అనేది ఒక జీవన విధానం.. అదే మా ఇద్దరినీ కలిపింది’.. రకుల్ పోస్ట్ వైరల్
నేడు యోగా డే సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు సోషల్ మీడియా వేదికన వరుస పోస్టులు పెడుతున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: నేడు యోగా డే సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు సోషల్ మీడియా వేదికన వరుస పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలో రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. యోగా కార్యక్రమంలో పాల్గొన్న ఈ హీరోయిన్.. వీడియో పంచుకుంది. ‘‘భారత గౌరవనీయ క్రీడా మంత్రి @mansukhmandviya జీతో కలిసి ఢిల్లీలో 2000 మంది ప్రజల మధ్య ఈరోజు వరల్డ్ యోగా డే జరుపుకున్నాను..
@ministryofayush @fitindiaoff ద్వారా ఫిట్‌నెస్ కపుల్ అవార్డును అందుకున్నందుకు చాలా కృతజ్ఞతలు. నా భర్త జాకీ భగ్నానీకి నాకు ఫిట్‌నెస్ అనేది ఒక జీవన విధానం.. అదే మా ఇద్దరినీ కలిపింది. ఈరోజు దానికి అవార్డు పొందడం చాలా బాగుంది. మీరందరూ ఫిట్‌నెస్ వైపు చిన్న అడుగులు వేస్తారని మేము నిజంగా ఆశిస్తున్నాము. ఎందుకంటే మీరు నిజంగా నివసించే ఏకైక ప్రదేశం మీ శరీరం’’ అంటూ టాలీవుడ్ ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో రాసుకొచ్చింది.
ఇకపోతే ఈ అమ్మడు తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించింది. సూపర్ స్టార్ మహేష్ బాబు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అండ్ నాగార్జున, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాస్ మహారాజా రవితేజ, రామ్ పోతినేని వంటి సీనియర్ కథానాయకుల సరసన చాన్స్లు కొట్టేసి.. మరింత ఫేమ్ తెచ్చుకుంది నటి రకుల్ ప్రీత్ సింగ్. ఇక ఈ అమ్మడు బాలీవుడ్ నిర్మాత అయిన జాకీ భగ్నానీని ప్రేమించి.. వివాహం చేసుకుంది.






