‘ప్రకృతిలోని అత్యుత్తమమైన వాటి స్పర్శతో ప్రతిరోజు గొప్పగా అనిపిస్తుంది’.. నటి ఇంట్రెస్టింగ్ పోస్ట్

by Kodari Anjali |   (  Updated:2025-05-23 14:52:45  IST  )

ప్రకృతిలోని అత్యుత్తమమైన వాటి స్పర్శతో ప్రతిరోజు గొప్పగా అనిపిస్తుందంటూ తాజాగా టాలీవుడ్ హీరోయిన్ రాశీ ఖన్నా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది.

‘ప్రకృతిలోని అత్యుత్తమమైన వాటి స్పర్శతో ప్రతిరోజు గొప్పగా అనిపిస్తుంది’.. నటి ఇంట్రెస్టింగ్ పోస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రకృతిలోని అత్యుత్తమమైన వాటి స్పర్శతో ప్రతిరోజు గొప్పగా అనిపిస్తుందంటూ తాజాగా టాలీవుడ్ హీరోయిన్ రాశీ ఖన్నా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. స్కిన్ కేర్‌కు సంబంధించి ఓ వీడియో పంచుకుని ఇలా రాసుకొచ్చింది. ‘‘మంచి అలవాట్లు మనసు, శరీరం, ఆత్మను రిఫ్రెష్ చేసే శక్తిని నేను నమ్ముతాను.

నా చర్మం విషయానికి వస్తే, నేను ఇష్టపడేది # ఏకాచ్చిఆదత్ అనేది మార్గో నీమ్ నేచురల్స్ వాడుతాను. ఇది వేప అండ్ ఇతర సహజ పదార్ధాల మంచితనంతో నిండి ఉంటుంది. ఇది ప్రతిరోజూ నా చర్మాన్ని మృదువుగా, అందంగా ఉంచడానికి వీలు కల్పిస్తుంది. మన దైనందిన జీవితంలో బుద్ధిపూర్వకమైన స్వీయ సంరక్షణను ఒక భాగంగా చేసుకుందాం.

ఎందుకంటే చిన్న చిన్న అడుగులు పెద్ద మార్పులకు దారితీస్తాయి. మీ ఏకాచ్చి ఆదత్ ఏమిటి? వ్యాఖ్యలలో నాకు చెప్పండి’’ అంటూ వీడియోకు ఈ విధంగా క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. ఇకపోతే ఈ బ్యూటీ మద్రాస్ కేఫ్, ఊహలు గుసగుసలాడే, బెంగాల్ టైగర్, జై లవ కుశ, తొలిప్రేమ, ప్రతి రోజు పండగే, వెంకీ మామ, సర్దార్ మామ, తిరుచిత్రాంబళం వంటి సినిమాల్లో నటించి ప్రేక్షకుల్ని మెప్పించింది.

Next Story