ముక్కు నుంచి రక్తం.. గాయాలతో దర్శనమిచ్చిన హీరోయిన్.. ఆందోళనలో ఫ్యాన్స్

by Kodari Anjali |

టాలీవుడ్ హీరోయిన్ రాశీ ఖన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

ముక్కు నుంచి రక్తం.. గాయాలతో దర్శనమిచ్చిన హీరోయిన్.. ఆందోళనలో ఫ్యాన్స్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరోయిన్ రాశీ ఖన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ బ్యూటీ కెరీర్ స్టార్టింగ్‌లో మంచి అవకాశాలు దక్కించుకుని.. ఉత్తమ నటిగా పేరు సంపాదించుకుంది. ఊహాలు గుసగుసలాడే చిత్రంలో తెలుగు పరిశ్రమలో తెలుగు పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే ఈ బ్యూటీ బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. తర్వాత ఈ ముద్దుగుమ్మ అగ్ర హీరోల సరసన అవకాశం కొట్టేసింది.

బెంగాల్ టైగర్, జోరు, శివం, సుప్రీమ్, హైపర్, రాజా ది గ్రేట్, టచ్ చేసి చూడు, తొలిప్రేమ, శైత్కానీ ఇమైక్కా నొడిగల్, అడంగా మారు, వెంకీ మామ, శ్రీనివాస కళ్యాణం వరల్డ్ ఫేమస్ లవర్, పక్కా కమర్షియల్ వంటి తెలుగు, తమిళ్, మలయాళం సినిమాల్లో నటించి.. తనకంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకుంది. అాగే తమిళ్‌లో అరణ్మణై అనే సినిమాలో నటించి.. మరింత క్రేజ్ సొంతం చేసుకుంది. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. కెరీర్ ప్రారంభంలోనే కన్నా ఇప్పుడు రాశీ ఖన్నాకు సినిమా అవకాశాలు తగ్గుముఖం పట్టాయని చెప్పుకోవచ్చు. ఇకపోతే ఈ బ్యూటీ తాజాగా సోషల్ మీడియా వేదికన ఓ పోస్ట్ పెట్టింది.

ఏమైందో క్లారిటీగా తెలియనప్పటికీ.. రాశీ ఖన్నా ముక్కులోంచి రక్తం కారుతూన్న ఫొటోలు పంచుకుంది. చేతికి కూడా గాయం అయినట్లు తెలుస్తోంది. అలాగే ఈ పోస్ట్‌కు ఓ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. ‘‘కొన్ని పాత్రలు అడగవు. అవి డిమాండ్ చేస్తాయి. మీ శరీరం.. మీ శ్వాస.. మీ గాయాలు.. మీరు తుఫానుగా మారినప్పుడు, ఉరుములకు మీరు కదలరు. త్వరలో వస్తుంది’’ అంటూ ఓ డిఫరెంట్ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. ఈ పోస్ట్ వీక్షించిన అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

Next Story