Priyamani: మాపై లవ్ జిహాద్ ఆరోపణలు చేస్తున్నారు.. సీనియర్ హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్

by Chukka Sudharani |

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న వారితో ప్రియమణి (Priyamani) ఒకరు.

Priyamani: మాపై లవ్ జిహాద్ ఆరోపణలు చేస్తున్నారు.. సీనియర్ హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న వారితో ప్రియమణి (Priyamani) ఒకరు. దక్షిణాది చిత్రపరిశ్రమతో పాటు బాలీవుడ్‌ (Bollywood)లోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది ప్రియమణి. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ (Second innings) స్టార్ట్ చేసి ఒకపక్క బుల్లితెరపై పలు షోలకు జడ్జిగా రాణిస్తూనే.. వరుస సినిమాలు చేస్తూ సందడి చేస్తుంది. ఈ క్రమంలోనే ఇటీవల ‘ఆఫీసర్ ఆన్ డ్యూటీ’ (Officer on Duty) అనే చిత్రంలో మెరిసిన ఈ అమ్మడు.. ఇప్పుడు దళపతి విజయ్ ‘జననాయగన్’, ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వంటి సినిమాలతో బిజీగా ఉంది. ఈ క్రమంలోనే వరుస ఇంటర్వ్యూస్ ఇస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇందులో భాగంగా.. ఇప్పటికే తన పెళ్లి గురించి పలుమార్లు ప్రస్తావించిన ప్రియమణి మరోసారి తన మ్యారేజ్ లైఫ్‌ (Marriage Life)పై షాకింగ్ కామెంట్స్ చేసింది.

‘నేను ముస్తఫా రాజ్‌(Mustafa Raj)ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. మా ఎంగేజ్‌మెంట్ సమయంలో ఈ విషయాన్ని ఆనందంగా అందరితో పంచుకోవాలనుకుంటే సంతోషిస్తారు అనుకున్నాను. కానీ అప్పటి నుంచే మాపై లవ్ జిహాద్ (Love Jihad) ఆరోపణలు చేస్తున్నారు. మా పెళ్లి విషయంలో ట్రోలింగ్ ఇప్పటికి జరుగుతూనే ఉంది. మేమిద్దం కలిసి ఉన్న ఫొటో షేర్ చేస్తే.. 90% మంది మా పెళ్లి గురించే కామెంట్స్ చేస్తారు. అంతే కాకుండా.. మీ పిల్లలు భవిష్యత్తులో ఐసిస్‌లో చేరుతారు అంటూ కామెంట్స్ చేస్తారు. అలాంటివి చాలా బాధకరంగా అనిపిస్తాయి. కానీ తన జీవితాన్ని తనకిష్టమైన విధంగా కొనసాగించాలని నిర్ణయించుకున్నాము. కాబట్టి ఇవ్వనీ పట్టించుకోము. అయినప్పటికీ మాపై ఇలాంటివి చేస్తూనే ఉన్నారు’ అంటూ చెప్పుకొచ్చింది.

Next Story