మెగా 158లో మాళవిక మోహనన్.. ఫైనల్లీ క్లారిటీ ఇస్తూ హీరోయిన్ పోస్ట్

by Chukka Sudharani |

మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ప్రజెంట్ వరుస ప్రాజెక్టులతో సందడి చేస్తున్నాడు.

మెగా 158లో మాళవిక మోహనన్.. ఫైనల్లీ క్లారిటీ ఇస్తూ హీరోయిన్ పోస్ట్
X

దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ప్రజెంట్ వరుస ప్రాజెక్టులతో సందడి చేస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతి స్పెషల్‌గా ‘మన శంకర వరప్రసాద్ గారు’(Mana Shankara Vara Prasad Garu) సినిమాతో వచ్చేందుకు సిద్ధంగా ఉన్న ఈయన.. అప్పుడే తన ‘మెగా 158’పై కూడా ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. బాబీ కొల్లి దర్శకత్వం(Director Bobby Kolli) వహించబోతున్న ఈ మూవీపై ఇప్పటికే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చింది. ఇక ఈ చిత్రం ప్రకటించినప్పటి నుంచి మెగా 158 కు సంబంధించి ఏదో ఒక న్యూస్ నెట్టింట వైరల్ అవుతూనే ఉంది. ఇందులో భాగంగానే ఈ సినిమాలో యంగ్ బ్యూటీ మాళవిక మోహనన్(Malavika Mohanan) కూడా భాగం కాబోతుందని.. ఈ కాంబో ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

అయితే.. తాజాగా ఈ వార్తలపై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చింది మాళవిక. ఈ మేరకు తన సోషల్ మీడియా అకౌంట్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ‘హాయ్ గాయ్స్.. బాబీ సర్ దర్శకత్వం వహిస్తున్న మెగా 158 లో నేను భాగం కాబోతున్నానని ఆన్‌లైన్‌లో చాలా వార్తలు వస్తున్నాయి. నా కెరీర్‌లో ఏదో ఒకరోజు మెగాస్టార్ చిరంజీవి సర్‌తో స్క్రీన్‌ను షేర్ చేసుకునే అవకాశం రావాలని నేను కోరుకుంటున్నాను. కానీ ఇప్పుడు అయితే నేను ఈ ప్రాజెక్ట్‌లో భాగం కాదని, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా అబద్ధమని స్పష్టం చేయాలనుకుంటున్నాను’ అంటూ ఫైనల్‌గా క్లారిటీ ఇచ్చింది మాళవిక. కాగా.. కన్నడ అగ్ర నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మించబోతున్న‘మెగా 158’షూటింగ్ నవంబర్ నెలకరు నుంచి స్టార్ట్ కానున్నట్లు తెలుస్తుంది.

Next Story