నితిన్ ‘తమ్ముడు’ నుంచి హీరోయిన్ పోస్టర్ రిలీజ్.. ట్రైబ‌ల్ యువ‌తిగా ఆకట్టుకుంటున్న లుక్

by Gugulothu.Kavitha |

యంగ్ హీరో నితిన్(Nithin) రీసెంట్‌గా ‘రాబిన్ హుడ్’(Robin Hood) సినిమాతో మనముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

నితిన్ ‘తమ్ముడు’ నుంచి హీరోయిన్ పోస్టర్ రిలీజ్.. ట్రైబ‌ల్ యువ‌తిగా ఆకట్టుకుంటున్న లుక్
X

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ హీరో నితిన్(Nithin) రీసెంట్‌గా ‘రాబిన్ హుడ్’(Robin Hood) సినిమాతో మనముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీగా బోల్తా కొట్టింది. ప్రస్తుతం నితిన్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘తమ్ముడు’(Thammudu). శ్రీరామ్ వేణు(Sriram Venu) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు(Dil Raju) నిర్మిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో లయ(Laya), స్వశిక(Swashika), వర్ష బొల్లమ్మ(Varsha Bollamma), సౌరభ్ సచ్‌దేవా(Sourabh Sachdev) కీలక పాత్రల్లో కనిపించనున్న ఈ చిత్రానికి అజనీష్ లోక్‌నాథ్(Ajaneesh Loknath) సంగీతం అందించారు.

ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) మూవీ టైటిల్‌తో వస్తున్న ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా ఈ చిత్రం జులై 25న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా నుంచి ఓ హీరోయిన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మూవీ టీమ్. ఈ సినిమాలో ‘కాంతార’(Kanthara) న‌టి స‌ప్త‌మి గౌడ(Sapthami Gouda) క‌థానాయిక‌గా న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. నేడు స‌ప్త‌మి బ‌ర్త్‌డే కావ‌డంతో ఆమెకి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలుపుతూ కొత్త పోస్ట‌ర్‌ను పంచుకున్నారు. ఈ ఫొటో చూస్తుంటే.. ట్రైబ‌ల్ యువ‌తిగా స‌ప్త‌మి క‌నిపించ‌బోతున్న‌ట్లు తెలుస్తుంది.

For Link Click Here:

Next Story