ప్రభుత్వ వాహనంలో ప్రయాణించిన హీరోయిన్.. సంచలనంగా మారిన వీడియోపై క్లారిటీ

by Chukka Sudharani |   (  Updated:2025-08-11 13:49:20  IST  )

హీరోయిన్ నిధి అగర్వాల్ ఏపీ ప్రభుత్వ వాహనంలో ప్రయాణించినట్లుగా పలు పోస్టులు, వీడియోలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.

ప్రభుత్వ వాహనంలో ప్రయాణించిన హీరోయిన్.. సంచలనంగా మారిన వీడియోపై క్లారిటీ
X

దిశ, సినిమా: హీరోయిన్ నిధి అగర్వాల్ ఏపీ ప్రభుత్వ వాహనంలో ప్రయాణించినట్లుగా పలు పోస్టులు, వీడియోలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. వాటిపై క్లారిటీ ఇస్తూ నిధి ఓ పోస్ట్ షేర్ చేసింది. ‘నేను ఇటీవల భీమవరంలో ఒక స్టోర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వెళ్లడంపై సోషల్ మీడియాలో కొన్ని రూమర్స్ వైరల్ అవుతున్నాయి. వాటిపై క్లారిటీ ఇచ్చేందుకే ఈ నోట్ షేర్ చేస్తున్నా. అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందినది కాదు. ఆ ఈవెంట్‌కు వెళ్లేందుకు స్థానిక నిర్వాహకులు ఏర్పాటు చేసిన వెహికల్‌లోనే నేను వెళ్లాను. అంతే కానీ, ఆ వాహనం సెలక్షన్‌లో నాకు ఎలాంటి సంబంధం లేదు. కొన్ని ఆన్‌లైన్ వెబ్‌సైట్స్ ఈ వాహనాన్ని ప్రభుత్వ అధికారులు నాకు పంపారని తప్పుడు పోస్ట్‌లు వైరల్ చేస్తున్నారు. అవి పూర్తిగా తప్పుడు వార్తలని నేను స్పష్టంగా చెప్పాలి అనుకుంటున్నా. నా ప్రేక్షకులకు నేను ఎంతో విలువ ఇస్తాను. అందుకే వాళ్లు తప్పు ప్రచారాలను నమ్మకూడదని నేను ఈ నోట్ షేర్ చేశాను. నాపై చూపించే అభిమానానికి, ప్రేమకు, మద్దతుకు నా అభిమానులకు, శ్రేయోభిలాషులకు ఎప్పుడు రుణపడి ఉంటాను’ అని తెలిపింది.

Next Story