- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Neha Sshetty: విజయవాడలోని ‘హాట్ స్పాట్ రెస్టారెంట్ & కేఫ్’ ప్రారంభోత్సవానికి హాజరైన టిల్లు బ్యూటీ
టిల్లు సినిమాతో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది హీరోయిన్ నేహా శెట్టి.

దిశ, వెబ్‌డెస్క్: టిల్లు సినిమాతో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది హీరోయిన్ నేహా శెట్టి. కుర్ర హీరో సిద్ధు జొన్నలగడ్డ సరసన డీజే టిల్లు సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డమ్ సంపాదించుకుంది. తర్వాత తెలుగులో వరుస అవకాశాలు దక్కించుకుంది. కేవలం తెలుగులోనే మాత్రమే కాకుండా.. కన్నడ సినీ ఇండస్ట్రీలోనూ మంచి గుర్తింపు సొంతం చేసుకుంది ఈ క్రేజీ బ్యూటీ. అతి తక్కువ సమయంలో స్టార్ గుర్తింపు తెచ్చుకుంది.
అయితే కొన్నాళ్లుగా తెలుగులో సైలెంట్‌గా ఉన్న నేహా శెట్టి.. డీజే టిల్లు తర్వాత ఒకట్రేండు చిత్రాల్లో మెరిసింది. తర్వాత ఒక్క మూవీ సైతం ప్రకటించలేదు. ఇక అప్పటి నుంచి కేవలం కన్నడలోనే తన నటనతో అక్కడి ప్రేక్షకుల్ని ఆకట్టుకునే పనిలో ఉంది. సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. ఈ కుర్ర నటి సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. ట్రెడిషనల్ అండ్ మోడ్రన్ డ్రెస్సుల్లో అదిరిపోయే ఫొటో షూట్లు చేస్తుంటుంది.
అయితే తాజాగా ఈ బ్యూటీ సోషల్ మీడియా వేదిక అయిన తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ పోస్ట్ పంచుకుంది. నేహా శెట్టి విజయవాడలో ఒక హోటల్ ప్రారంభోత్సవానికి వెళ్లింది. ఈ వేడుక మే 12, 2025న జరిగింది. అయితే విజయవాడలోని ‘హాట్ స్పాట్ రెస్టారెంట్ & కేఫ్’ ప్రారంభోత్సవానికి హాజరయ్యింది. ఈ రెస్టారెంట్ పోరెంకిలో, క్యాపిటల్ ఆసుపత్రి ఎదురుగా ఉంది. ఈ కార్యక్రమం గురించి, ఇతర వివరాల గురించి Instagram లో పోస్ట్ చేసింది. అలాగే, నేహా శెట్టి విజయవాడలో కొన్ని ఇతర కార్యక్రమాలలో కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది.






